![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -731 లో.....ఎందుకు అమ్మ కాంచన ఇంటికి వెళ్ళావని మాలినిని దక్షిణామూర్తి అడుగుతాడు. కార్తీక , దీప మిమ్మల్ని కాపాడారు.. వాళ్ళని ఆ పరిస్థితిలో చూసి సాయం చెయ్యాలనిపించిందని మాలిని అంటుంది. వాళ్ళ కుటుంబం వల్ల మనం ఎంత నష్టపోయామో మనకి తెలుసు బాబాయ్ బలాన్ని ఒక్కొకరిగా దూరం చేస్తానని మాలిని అంటుంది.నువ్వు ఇలాంటివి ఏమైనా చేస్తే నాకు చెప్పమని దక్షిణామూర్తి అంటాడు.
మరొకవైపు జ్యోత్స్న వంక సూరజ్ చూస్తూ ఉంటాడు. జ్యోత్స్న చూస్తుందని స్పెడ్స్ పెట్టుకొని కవర్ చేస్తూ చూస్తాడు. నన్ను ఎందుకు చూస్తున్నావని జ్యోత్స్న అడుగుతుంది. నేను చూస్తున్నానని నీకెలా తెలుసని సూరజ్ అడుగుతాడు. నేనే నన్ను ప్రేమించమని వెంటపడుతున్నానా అని జ్యోత్స్న అనగానే ఆ రోజు తప్పకుండా వస్తుందని సూరజ్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్నకి పారు ఫోన్ చేసి త్వరగా బయటకురా మనం ఒక చోటుకి వెళ్ళాలి.. నీ ఫోన్ కుడా అక్కడే వదిలేసిరా అని పారిజాతం అనగానే జ్యోత్స్న తన ఫోన్ అక్కడ పెట్టి వెళ్లిపోతుంటే అప్పుడే సూరజ్ వచ్చి ఎక్కడికి అని అంటాడు. నీ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి అని అబద్ధం చెప్తుంది జ్యోత్స్న.
ఆ తర్వాత మాలిని దగ్గరికి జ్యోత్స్న ని తీసుకొని పారిజాతం వెళ్తుంది. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది. మరొకవైపు జ్యోత్స్న ఆఫీస్ లో లేదు ఎక్కడికి వెళ్ళిందని శివన్నారాయణ, కార్తీక, దీప అనుకుంటారు అప్పుడే సూరజ్ వచ్చి.. ఏదో ఫోన్ రాగానే వెళ్ళిపోయిందని చెప్తాడు.అప్పుడే జ్యోత్స్నకి కార్తీక్ ఫోన్ చేస్తే అక్కడే రింగ్ అవుతుంది. పారిజాతానికి శివన్నారాయణ ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుంది. వీళ్లిద్దరు ఎక్కడికి వెళ్లారని అందరు అనుకుంటారు. మరొకవైపు నా మేనకోడలికి పొగరు ఎక్కువే అని జ్యోత్స్నని ఉద్దేశ్శించి మాలిని అంటుంది. అసలు నన్ను ఎందుకు పిలిచారో చెప్పమని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |