![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -729 లో.....కార్తీక్, దీప జరిగింది అంతా కాంచనకి చెప్తారు. దీప నువ్వు గెలిచి మా నాన్నని కూడా గెలిపించావని కాంచన అంటుంది. నువ్వు ముందు దీపకి దిష్టి తియ్ రా.. ఎంత మంది కళ్ళు పడ్డాయో ఏంటో అని కాంచన అంటుంది. దీపకి రోజు దిష్టి తగులుతుంది అమ్మ ఆ పారు ఉంది కదా తనదే అని కార్తీక్ అంటాడు. అవును రా.. నోరు ఎప్పుడు కుదరగా ఉండదని కాంచన అంటుంది. వెళ్లి స్నానం చేసిరా బావ భోజనం చేద్దామని కార్తీక్ తో దీప అంటుంది.
మాట్లాడుతున్నాడు కదా అని కాంచన అనగానే అప్పుడే శౌర్య వచ్చి వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చారు. నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావ్ కదా అని శౌర్య అనగానే ఏంటే నేను కూడా ఆఫీస్ కి వెళ్లాలా అని కాంచన అంటుంది. అబ్బో వద్దులే నన్ను స్కూల్ కి ఎవరు రెడీ చేస్తారని శౌర్య అంటుంది. మరొకవైపు సూరజ్ దగ్గరికి సుమిత్ర వెళ్తుంది. ఎందుకు నా కూతురు విషయంలో అంత రియాక్ట్ అయ్యావని సుమిత్ర అడుగుతుంది. నాకు ఆ సిచువేషన్ లో అలా అనిపించింది మేడం అది మిమ్మల్ని హర్ట్ చేస్తే సారీ అని సూరజ్ అంటాడు. నిజానికి నేనే నీకు థాంక్స్ చెప్పాలని సుమిత్ర అంటుంది. మీ ఫ్యామిలీ గురించి చెప్పమని సుమిత్ర అనగానే అప్పుడే సుమిత్రని పారిజాతం పిలుస్తుంది. ఈ విషయాలు తర్వాత మాట్లాడుకుందామని సుమిత్ర వెళ్తుంది. మరొక వైపు కాంచన ఇంటికి మాలిని వస్తుంది. ఎందుకు నా ఇంటికి వచ్చావని కాంచన కోప్పడుతుంది. మీ నాన్న నిన్ను వదిలేసాడు అందుకే ఈ ఇంట్లో ఉంటున్నావని మాలిని అనగానే కార్తీక్, దీప తనపై కోప్పడుతారు. ఈ చెక్ ఇస్తున్నా.. ఇది తీసుకొని మీరందరు నావైపు ఉండండి అని మాలిని అంటుంది . కార్తీక్ గొడవ పెట్టబోతుంటే కాంచన ఆపుతుంది.
ఆ తర్వాత సూరజ్ కి శివన్నారాయణ ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావ్ వస్తున్నా అంటాడు. కాంచన ఇంటికి శివన్నారాయణ వెళ్లి మాలిని ఇచ్చిన చెక్ , పండ్లు తీసుకొని రా అని కార్తీక్ తో అంటాడు. కార్తీక్, సూరజ్ ని తీసుకొని దక్షిణామూర్తి ఇంటికి వస్తాడు. ఏంటి ఈ ఇంటికి తీసుకొని వచ్చారని సూరజ్ అనగానే అంటే ఈ ఇల్లు ఎవరిదో నీకు తెలుసా అని శివన్నారాయణ అంటాడు. లేదు ఇది మీ బంధువులదా అని అనబోతున్నానని సూరజ్ అంటాడు. ఇది శత్రువు దక్షిణామూర్తిది అని శివన్నారాయణ చెప్తాడు. ఆ తర్వాత ఎందుకు అత్తయ్య తాతయ్య కి చెప్పారని దీప అంటుంది. ఇంకొకసారి ఇది జరగకుండా ఉండాలని చెప్పానని కాంచన అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |