Home  »  TV News  »  Illu illalu pillalu : వేదవతికి తిరుపతి ఇచ్చిన బిగ్ సర్ ప్రైజ్.. సుకన్యను చూసి షాకైన ధీరజ్!

Updated : Jul 23, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -530 లో...   పుట్టింటి వాళ్ళు వస్తున్నారని వేదవతి చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రొద్దున లేచినప్పటి నుంచి వాళ్ళకి ఏం ఇష్టమో అన్ని రకాల వంటలు వండుతుంది. అందరిచేత పనులు చేయిస్తుంది. వేదవతి ఎమోషనల్ అవుతుంది. తన వాళ్ళ గురించి తన కొడుకులకి వేదవతి చెప్తూ ఎమోషనల్ అవుతుంది. ప్రేమ కూడా ఎమోషనల్ అవుతుంటే నువ్వు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావని ధీరజ్ అనగానే అది నాక్కూడా పుట్టిల్లేరా అని ప్రేమ అంటుంది.

కొంపతీసి నువ్వు కూడా వంటలు చేస్తావా ఏంటని ధీరజ్ అనగానే అందరు నవ్వుతారు. మా పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఎప్పుడైనా చేసారా అని నర్మద అంటుంది. రేపు రమ్మను అన్నీ చేస్తానని వేదవతి అంటుంది. అందరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏ చీర కట్టుకోవాలని వేదవతి అన్ని రకాల చీరలు చూస్తుంది‌. తన ఆనందం చూసి రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరు రెడీ అయి హాల్లోకి వస్తారు. బా అని వల్లి చందు షర్ట్ బటన్ పెట్టబోతుంటే తనపై చందు కోప్పడి వెళ్ళిపోతాడు. నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం అయిన వారిలో ప్రేమ ఒకతి.. ఇప్పుడు తనకి కూడా ఇదే పరిస్థితి వచ్చేలా చేస్తానని వల్లి తన మనసులో అనుకుంటుంది. 

ఆ తర్వాత కామాక్షి కూడా తన భర్తతో వస్తుంది. అక్క నీకొక సర్ ప్రైజ్ అంటూ వేదవతిని తిరుపతి బయటకు తీసుకొని వెళ్లి సుకన్యని చూపిస్తాడు. నువ్వు ఏంటి ఇక్కడ అని వేదవతి తనపై కోప్పడుతుంది. అప్పుడే ధీరజ్ వచ్చి.. అమ్మా మామ ఏదో నడిపిస్తున్నాడు.. తర్వాత చెప్తాను.. గొడవ చెయ్యకని ధీరజ్ అంటాడు. సుకన్య, వల్లి ఒక దగ్గరికి వచ్చి ఇంకాసేపట్లో గొడవవుతుందని అనుకుంటారు. ఆ తర్వాత భద్రవతి కుటుంబంతో సహా రామరాజు ఇంటి ముందుకి వస్తుంది. ఇక వేదవతి భద్రవతి దగ్గరికి వెళ్తుంది. భద్రవతిని హగ్ చేసుకొని వేదవతి  ఎమోషనల్ అవుతుంది. ప్రేమ కూడా వెళ్లి అందరితో మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.