Home  »  TV News  »  Ye Devi Varamo Neevu: అంజలికి నిజం చెప్పేసిన జానకమ్మ.. 

Updated : Jul 18, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-11 లో.. గీతాంజలి వాళ్ళ నాన్న రాజారాం అప్పుడే కార్ లో నుండి దిగి వస్తుంటే అతని ఎదురుగా గీతాంజలి వచ్చి నిలబడుతుంది. ఆమెను చూసి రాజారాం షాక్ అవుతాడు. ఇంతసమయం వరకు మీరు ఎక్కడికి వెళ్ళారు నాన్న అని గీతాంజలి అడుగగా రాజారాం ఏం చెప్పడు. మీరు చెప్పకపోతే నాకు తెలియదని అనుకుంటున్నారా..‌వైజాగ్ లోని శబరి అనాధాశ్రమానికి వెళ్ళారు కదా అని గీతాంజలి అనగానే రాజారాం షాక్ అవుతాడు. ఎందుకు నాన్న ఎందుకు వెళ్ళారని గీతాంజలి అడుగుతుంది. నాన్నగా  అది నా బాధ్యత.. కూతురి విషయంలో నేను చొరవతీసుకున్నానని రాజారాం అనగానే అది కరెక్ట్ కాదు నాన్న.. నేను పెద్దయ్యేవరకు, నా పెళ్ళి అయ్యేవరకు మీరు నా గురించి ఆలోచించాలి కానీ నాకు పెళ్ళి అయి ముగ్గురు పిల్లలున్నారు ఇప్పుడు కూడా ఆలోచించాలా అని గీతాంజలి కోప్పడుతుంది.

ఆ ల్యాండ్ ఇష్యూ గురించి మర్చిపోండి.. ఇంతకముందు ఇలాంటివి ఎన్నో చూశాం కదా.. కాకపోతే అప్పుడు హైదరాబాదులో.. ఇప్పుడు వైజాగ్ లో అంతేకదా అని గీతాంజలి అంటుంది. ఓహ్.. ల్యాండ్ గురించి అనుకుంటుందా..‌నేనింకా అంజలి గురించి ఏమో అని అనుకున్నానని రాజారాం మనసులో అనుకొని రిలాక్స్ అవుతాడు. మీరింక ఈ ల్యాండ్ గురించి ఆలోచించడం మానేసి మీ ఆరోగ్యం గురించి ఆలోచించండి అని రాజారాం మీద గీతాంజలి కోప్పడుతుంది. దాంతో సరే అమ్మ అని రాజారాం అక్కడి నుండి వెళతాడు. మరోవైపు జానకమ్మ బాధపడుతుంది. దేవుడా ఎందరో అనాధలని చేరదీసి వారికి మంచి జీవితం అందించేలా చేశారు. ఇక నా దగ్గర మిగిలింది అంజలి ఒక్కతే. అప్పుడే తనకి దగ్గు వస్తుంది. దాంతో నోట్లో నుండి బ్లడ్ పడుతుంది. అది చూసి తను త్వరగా చనిపోతాననే విషయం అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా అంజలికి నిజం చెప్పాలని అనుకుంటుంది.

జానకమ్మ కంగారుగా వెళుతుంటే తనకు గాయమవుతుంది. ఇక తను ఒక దగ్గర పడిపోతుంది. వెంటనే జానకమ్మ దగ్గరికి అంజలి పరుగున వస్తుంది. ఏం అయింది అమ్మా అని అనగానే నేను ఎక్కువ కాలం బ్రతకను.. నా ఆయుష్షు తగ్గిందని నాకు అర్థమవుతుందని జానకమ్మ అంటుంది. అలా అనకండి అమ్మ.. డాక్టర్ చెప్పారు కదా మీరు బ్రతుకుతారని అని అంజలి ఏడుస్తుంటే..నాకు తెలుస్తుంది అని జానకమ్మ అంటుంది. నేను చనిపోయేలోపు నీకు నిజం చెప్పాలి.. నీకు ఒక‌ కుటుంబం ఉంది అని జానకమ్మ అనగానే అంజలి సంతోషపడుతుంది. అక్కడ బాక్స్ లో ఉన్న ఫైల్ ని తీసుకుని రావమ్మ అని జానకమ్మ అనగానే అంజలి అది తీసుకొని వస్తుంది. ఇన్ని రోజులు నన్న అడిగిన ప్రశ్నలకి , నీ వాళ్ళ కోసం నువ్వు ఎదురుచూసిన నిరీక్షణకి సమాధానం ఉంది ఇందులో అని చెప్పి ఆ ఫైల్ లో ఉన్న బ్యాంక్ చెక్ తీసి అంజలికి ఇస్తుంది జానకమ్మ. ‌ఇందులోనే నీ వాళ్ళ వివరాలున్నాయని జానకమ్మ అంటుంది.  అందులో రాజారాం అని ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.