![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -51 లో..... నందుకి సింహాద్రి అమెరికా సంబంధం తీసుకొని వస్తాడు. త్వరగా రెడీ చేసి అమ్మాయిని తీసుకొని రండి అని సింహాద్రి చెప్తాడు. నందు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంటి అమ్మ ఇంత సడన్ గా అమెరికా సంబంధం రావడం ఏంటని జాను డౌట్ పడుతుంటే నీకు ఎందుకే అవన్నీ సింహాద్రి అన్నయ్య చూసుకుంటాడని శారద కోప్పడుతుంది. ఆ తర్వాత నందుని చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తారు.
అమ్మాయి బాగా నచ్చిందని అబ్బాయి వాళ్ళు చెప్తారు. మా వాడికి లీవ్ లు లెవ్వు .. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకొని త్వరగా అమెరికా వెళ్ళాలని చెప్తారు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏం పర్లేదని శారద వాళ్ళకి సింహాద్రి నచ్చజెప్పుతాడు. దాంతో వాళ్ళు కూడా సరే అంటారు. ఒక్క నిమిషం ఆగండి మీ జాబ్ డీటేల్స్ చెప్పండి అని జాను అనగానే మీరు మమ్మల్ని అవమానిస్తున్నారని అబ్బాయి అంటాడు. జానూ నువ్వు ఆగు అని సింహాద్రి చెప్తాడు. మరొకవైపు మురళికి పెళ్లి సంబంధం వస్తుంది. నేను పెళ్లి చేసుకోనని మురళి అనగానే నువ్వు చేసుకోకుంటే చచ్చిపోతానని శాంతి బ్లాక్ మెయిల్ చేస్తుంది. దాంతో మురళి సరే అంటాడు. సాయంత్రం పెళ్లి చూపులకి వెళదామని శాంతి అంటుంది.
మరొకవైపు సూర్య బాక్సింగ్ చేస్తూ తుఫాన్ మొహం పచ్చడి చేస్తాడు. అప్పుడే జాను వస్తుంది. ఎన్ని సార్లు ఫోన్ చెయ్యాలని సూర్యని జాను కోప్పడుతుంది. ఆగు నీ ఫ్రస్ట్రేషన్ మొత్తం కంట్రోల్ చేసుకో.. ఈ బాక్సింగ్ చెయ్ అని సూర్య అంటాడు. దాంతో జాను గ్లౌసెస్ తొడుక్కొని బాక్సింగ్ ఆడుతూ ఆడుతూ సూర్యని కొడుతుంది. అయ్యో సూర్య దెబ్బ తగిలిందా అని జాను అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |