![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ని సిబ్లింగ్స్ స్పెషల్ గా తీసుకురాబోతున్నారు. ఇందులో ముందుగా ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ అన్నయ్య సీతారాములు, కావ్య - కేసరి, హరి తేజ - హరి నిత్యా, అధిక - అమోఘ్, ప్రియాంక జైన్ -జెనిల్ ఇమ్మానుయేల్ - డేనియల్ వచ్చారు. "మీ తమ్ముడిని అందరూ బుల్లితెర మెగాస్టార్ అని అంటారు. అలా అన్నప్పుడు మీరు ఒక అన్నయ్యగా ఎలా ఫీలవుతుంటారు " అని సీతారాములని అడిగింది శ్రీముఖి. "నాగబాబు - పవన్ కళ్యాణ్ ఫీలైనట్టు ఫీలవుతుంటాను " అని చెప్పారు.
"డేనియల్ మీరు అసలు ఎప్పటినుంచి బ్రదర్స్ " అంటూ కామెడీ చేసింది శ్రీముఖి. "హే ఎప్పటినుంచి ఏంటమ్మా చిన్నప్పటినుంచి బ్రదర్స్ " అన్నాడు ఇమ్మానుయేల్. "కావ్య నువ్వొచ్చినప్పుడే అందరూ వావ్ అంటారు ఇప్పుడు డబుల్ వావ్ " అంటూ కావ్య సిస్టర్ కేసరిని పరిచయం చేసింది. ఇక సీతారాములు ఐతే "హాయ్ గర్ల్స్ " అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు.ప్రభాకర్ మాత్రం తలపట్టుకున్నాడు. "నీ పేరేమిటి " అని శ్రీముఖి ఇంగ్లీష్ లో అడిగింది. "కేసరి " అని చెప్పింది. "రవ్వ కేసరినా" అని అడిగాడు అవినాష్. దాంతో సీరియస్ గా చూసింది. లేదు "భగవంత్ కేసరి" అన్నాడు హరి. "నీకొచ్చిన కొంచెం కొంచెం తెలుగులో ఏదన్న కొంచెం మావాడితో మాట్లాడవా " అని కేసరిని అడిగింది. "హాయ్ అన్న " అని పిలిచింది. అంతే హరి ఫేస్ మాడిపోయింది.
తర్వాత ప్రియాంక జైన్ - జెనిల్ వచ్చారు. వెంటనే అవినాష్ జెనిల్ ని ఎత్తుకుని ఎలా ఉన్నావ్ అన్నాడు.వెంటనే ప్రభాకర్ "అరేయ్ నీలో ఆ పెద్దరికం పోలేదు రా . పిల్లలు కనపడగానే సంఖ్యలో వేసుకుని తిరగడం" అన్నాడు. సీతారాములు కళ్ళజోడు పెట్టుకుని కుర్చునేసరికి శ్రీముఖి ప్రియాంక జైన్ ని పట్టుకుని వెళ్లి "సీతారాం ఇంకా పడుకునే ఉన్నారా లేచారా..మీరు ఇందాక కత్తిలాంటి అమ్మాయి వస్తుందని అన్నారు కదా ఇదే ఆ కత్తి ఎలా ఉంది " అని చూపించింది. "కత్తి లాగే ఉంది " అన్నాడు. "లేచిపోయాడేంటి మా అన్నయ్య" అంటూ పక్కనుంచి ప్రభాకర్ కౌంటర్ వేసాడు.
తర్వాత ఆషిక - అమోఘ్ వచ్చారు. "నేను మీ బ్యూటీకి మెస్మోరైజ్ ఐపోయాను " అని అమోఘ్ అనేసరికి ఒక హగ్ ఇచ్చింది శ్రీముఖి. వెంటనే అవినాష్ ఆషికాని హగ్ చేసుకోబోయాడు. వెంటనే అమోఘ్ "ఇంకో సారి ఇలా మా సిస్టర్ ని ఫ్లర్ట్ చేస్తే నా కండల మధ్య పిసికేస్తా" అని వార్నింగ్ ఇచ్చాడు. "మరి మా శ్రీముఖిని హగ్ చేసుకున్నావ్ గా " అన్నాడు అవినాష్. ఇక హరితేజ - హరి నిత్యా వచ్చారు. "ఇది నా చెల్లి మొన్నే చేశా పెళ్లి. వెయిటింగ్ ఫర్ ది" అనేసరికి హరి నిత్య "ఆ ఓకే ఓకే" అంటూ హరి తేజ కాళ్ళ మీద పడి బ్లేసింగ్ తీసుకుంది. "మీరు ఇదేనా ఫస్ట్ టైం టీవీకి రావడం" అని శ్రీముఖి అడిగింది. "చిన్నప్పుడెప్పుడో " అంది హరి నిత్యా. "మీరు ఇప్పుడు చిన్నగానే ఉన్నారు కదా " అన్నాడు అవినాష్. "ఆమెకు పెళ్ళై ఒక హజ్బెండ్ ఉన్నాడు " అంది శ్రీముఖి. "ఒక హజ్బెండ్ ఉంటారు ఎవరికైనా " అని హరి తేజ క్లారిటీ ఇచ్చింది.
![]() |
![]() |