![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇక ఈ షోకి చాలామంది బుల్లితెర సెలబ్రిటీస్ వచ్చారు. అలాగే శ్రీముఖి అందరికీ దావత్ ఇచ్చింది. అలాగే ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే శ్రీముఖి వాళ్ళ అమ్మను తీసుకొచ్చింది. శ్రీముఖి వాళ్ళ అమ్మ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వీడియోస్, మోటివేషనల్ స్టోరీస్ తో దుమ్ము దులుపుతోంది. ఇక ఇప్పుడు ఈ షోకి నల్ల చీర కట్టుకుని వచ్చింది.
అంటే శ్రీముఖి వాళ్ళ అమ్మను చూసేసరికి ఫుల్ జోష్ తో "నల్లంచు తెల్లచీర " సాంగ్ వేసుకుంది. వాళ్ళ అమ్మ స్టెప్పులేసింది. "నా ఎనర్జీ మొత్తం పోగేసి ఈ బ్రాండ్ ని తయారుచేసాను" అనేసరికి అందరూ గట్టిగా అరుపులు కేకలు పెట్టారు. "మొట్టమొదటి సారి శ్రీముఖి తన తల్లితో కలిసి ఇస్తున్న శ్రీముఖి దావత్" అంటూ స్టేజి మీద టేబుల్ వేసి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తో ఫుల్ జోష్ తో ఈ దావత్ ని ఇచ్చింది. ఇక స్పెషల్ అట్రాక్షన్ గా తమన్నా సింహాద్రి కూడా వచ్చింది.
అలాగే జ్యోతక్క, నిఖిల్ మెళియక్కాల్, ప్రియాంక జైన్, విజె సన్నీ, సుహాసిని వంటి వాళ్లంతా వచ్చారు. ఇక నెటిజన్స్ ఐతే శ్రీముఖి పక్క బాలు ఉంటే బాగుండేది కదా..ఎందుకు పిలవలేదు అని అడుగుతున్నారు. శ్రీముఖి వాళ్ళ అమ్మ పుట్టిన రోజులు ఓకే రోజు కావడంతో ఈ దావత్ ఇచ్చినట్టు లతా శ్రీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టుకుంది.
![]() |