![]() |
![]() |

పొదరిల్లు సీరియల్ లో మహా పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది నటి కృతిక ఉమాశంకర్. కర్ణాటకకి చెందిన కృతిక స్టార్ మాలో ప్రసారమవుతున్న 'మగువ ఓ మగువా' సీరియల్తో తెలుగు ఆడియన్స్ కు తొలిసారి పరిచయమైంది. ఇందులో సింధూర పాత్రలో నటించి మెప్పించింది. ఇది నడుస్తుండగానే 'పొదరిల్లు' సీరియల్లో హీరోయిన్ గా అవకాశం లభించింది.
స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో 'పొదరిల్లు' సీరియల్ కి టీఆర్పీ అత్యధికంగా ఉంది. మరి ఈ సీరియల్ కథేంటో ఓసారి చూసేద్దాం.. నారాయణ కొడుకులు మాధవ, కేశవ, చక్రి, కన్నా.. ఓ మిడిల్ క్లాస్ ఇంట్లో ఉంటారు. వాళ్ళకి ఓ శాపం ఉంటుంది. ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరగదని, వాళ్ళ కొడుకులకి పెళ్ళిళ్ళు కావు అని నారాయణ వాళ్ళ చెల్లెలు తాయారు శాపం పెడుతుంది. దాంతో ఆ ఇంటికి ఏ ఆడపిల్ల రావడానికి ఇష్టపడదు. అయితే తాయారు కూతురు గాయత్రీ మాత్రం నారాయణ పెద్దకొడుకు మాధవని ఇష్టపడుతుంది. మాధవ, గాయత్రీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చచ్చిపోతామంటూ తాయారు ఆమె భర్త ఇద్దరు కలిసి గాయత్రీని బెదిరిస్తారు. ఇక అదే ఇంటికి అనుకోని పరిస్థితుల్లో చక్రిని పెళ్ళి చేసుకొని మహాలక్ష్మి వస్తుంది. ఇక తను ఇంట్లో ఉండటానికి ఇష్టపడదు కానీ మాధవ, కన్నాల మంచితనం, అమాయకత్వం చూసి వారితో పాటే అదే ఇంట్లో ఉంటుంది. ఒక మంచి జాబ్ చూసుకొని సెటిల్ అవ్వాలనుకున్న మహాలక్ష్మి ఒక మిడిల్ క్లాస్ ఇంట్లోకి వెళ్తుంది. అయితే చక్రిని మాత్రం తను భర్తగా అంగీకరించదు. మరి మహాలక్ష్మి తన లక్ష్యం నెరవేర్చుకుంటుందా..చక్రిని భర్తగా అంగీకరిస్తుందా తెలియాలంటే ఈ 'పొదరిల్లు' సీరియల్ చూడాల్సిందే.
తాజాగా కృతికకి స్టార్ మా పరివార్ అవార్డ్స్ లో ' బెస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ ఫిమేల్ ' అవార్డ్ లభించింది. అది తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది కృతిక. ఇక తను తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్న విషయాలు షేర్ చేసుకుంది. తను మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్లాలనుకున్నప్పుడు తనకి సీరియల్ లో ఛాన్స్ వచ్చిందని, అప్పుడు వాళ్ళ అమ్మే తనకి సపోర్ట్ చేసిందని చెప్పింది. వాళ్ళ నాన్నని ఒప్పించేలా వాళ్ళ సపోర్ట్ చేసినట్టుగా కృతిక చెప్పుకొచ్చింది. తెలుగులో ప్రభాస్ నా ఫేవరెట్ హీరో.. మిర్చి సినిమా అంటే చాలా ఇష్టం.. ప్రభాస్ పాత సినిమాలన్నీ నేను చూశాను.. అత్తారింటికి దారేది సినిమా కూడా నాకు ఇష్టం.. టాలీవుడ్లో నా క్రష్.. మహేష్ బాబు, ప్రభాస్. హీరోయిన్లలో అయితే అనుష్క,త్రిష, సౌందర్య, శ్రీదేవి.. అంటే ఇష్టమని కృతిక చెప్పింది. ఇక కృతిక ఉమాశంకర్(Kruthika Umashankar) కి ఇన్ స్టాగ్రామ్ లో 144K ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా పొదరిల్లు సీరియల్ వంద ఎపిసోడ్ లు పూర్తిచేసుకుంది. మరి మహా పాత్రలో కృతిక ఎలా నటిస్తుందో కామెంట్ చేయండి.
![]() |
![]() |