![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1024 లో.....రాజు, కావ్య రాసిన వీలునామా చూసి రేఖ, భూషణ్ షాక్ అవుతారు. వీలునామా ప్రకారం ఇందుకి పెళ్లి అయితేనే తనకి ఆస్తులు సొంతం అవుతాయని అందులో ఉంటుంది. దాంతో రేఖ డిస్సప్పాయింట్ అవుతుంది. నా సంతకం చెల్లదు నానమ్మ ఎందుకంటే అమ్మానాన్న వీలునామాలో నాకు పెళ్లి అయితేనే ఆస్తులు నా సొంతం అవుతాయన్నట్టు ఉందని అపర్ణ వాళ్ళకి ఇందు చెప్పగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు
అసలు ఈ విషయం నీకెలా తెలుసని అపర్ణ అడుగుతుంది. రాత్రి లాయర్ ఫోన్ చేసి చెప్పాడు.. అందుకే నేను అంత కాన్ఫిడెంట్ గా వేలిముద్ర వేసానని ఇందు చెప్తుంది. ఆ తర్వాత భ్రమరాంబ, భూషణ్ , రేఖ టెన్షన్ పడుతారు. ఇన్ని రోజులు ఎంతో ఉహించుకున్నాం.. ఇలా జరుగుతుంది అనుకోలేదని శేషు అంటాడు. నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో బాగా తెలుసని రేఖ తన కొడుకుకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నా మార్నింగ్ వరకు ఇక్కడ ఉండాలని చెప్తుంది. మరొకవైపు రాజు పడుకొని ఉంటాడు. తనవంక చలపతి, లక్ష్మీ చూస్తుంటారు. గొప్పింటి బిడ్డ ఇన్ని రోజులు ఈ ఇంట్లో కష్టాలు పడ్డాడని అనుకుంటారు.
తనకి ఏదో కల వచ్చిందని అంటాడు కదా ఇప్పుడు మనం నిజం చెప్పొద్దూ ఎందుకంటే నిజం తెలుసుకొని ఆ రేఖకు ఎదురువెళ్తే కష్టం అని లక్ష్మీతో చలపతి అంటాడు. మరుసటి రోజు రేఖ కొడుకు మదన్ వస్తాడు. అర్జెంట్ గా రమ్మన్నారు ఎందుకని అంటాడు. ఇందుని పెళ్లి చేసుకోవాలని అంటుంది. నేను చేసుకోనని మదన్ చెప్తాడు. ఆస్తులు మన చేతికి వచ్చాక విడాకులు ఇవ్వు నీకు నచ్చిన పెళ్లి చేసుకోమని రేఖ అంటుంది. ఆ తర్వాత ఏంటి రేఖ నువు ఏం చేస్తున్నావ్ నీ కొడుకుకి నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తామని అనుకున్నాం కదా అని భ్రమరాంబ అంటుంది. మీకేం ఉందని మీ అమ్మాయిని నాకు కోడలు చేసుకుంటానని రేఖ అనగానే భ్రమరాంబ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |