![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాతో ఎపిసోడ్ -658 లో..... కార్తీక్ ప్లాన్ ప్రకారం జ్యోత్స్నకి ఒక సంబంధం తీసుకొని వస్తాడు. ఇక పారు, దీప కలిసి రెచ్చగొట్టి జ్యోత్స్న రెడీ అయి కిందకి వచ్చేలా చేస్తారు. కింద పెళ్లిచూపులు చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. అమ్మాయి నాకు నచ్చిందని అబ్బాయి అంటాడు. నాకు వాడు నచ్చలేదని జ్యోత్స్న అంటుంది. అయితే వేరొక సంబంధం రెడీగా ఉందని కార్తీక్ అంటాడు. మీరు ఎవరిని తీసుకొని వచ్చినా నేను చేసుకోను.. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళరా అని అబ్బాయితో జ్యోత్స్న అనగానే ఈ డైలాగ్ లేదేంటి అని అబ్బాయి పేపర్ తీసి చూస్తాడు. ఇదంతా జ్యోత్స్న మనసులో ఏముందో తెలుసుకోవడానికి అని పారు అంటుంది. అబ్బాయిగా వచ్చిన అతనికి పారు డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. అసలు ఏం జరుగుతుందని దశరథ్ అడుగుతాడు.
జ్యోత్స్న మాటలు విన్నారు కదా.. అసలు పెళ్లి చేసుకోను అంటుంది. ఇదే నిజమైన సంబంధం అయితే పరువుపోయేదని కార్తీక్ అంటాడు. ఏంటి జ్యోత్స్న పెళ్లి చేసుకుంటానన్నావ్ ఇప్పుడు చేసుకోనంటున్నావ్.. ఏంటి తమాషానా అని జ్యోత్స్నపై సుమిత్ర కోప్పడుతుంది. మరొకవైపు కావేరికి స్వప్న హెల్ప్ చేస్తానంటే వద్దని అంటుంది. ఏంటి మమ్మీ.. నీ మాట వింటేనే చెయ్యనిస్తావా అని స్వప్న అంటుంది. నేను చేసిన తప్పు ఏంటి నాకు నచ్చినట్లు ఉండాలని అనుకుంటున్నాను.. పెద్దమ్మ తనకి నచ్చినట్లు డాడీని వద్దని అనుకుంది కదా అని అంటుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. కాశీ నాకన్నా చాలా బెటర్.. నేను భార్య ఉండగా మీ అమ్మని చేసుకున్నాను కానీ నువ్వు వాడిని వద్దని అంటున్నా కూడా కనీసం పరాయి ఆడదాన్ని కూడా చూడలేదని శ్రీధర్ అంటాడు. ఫైనల్ గా నువ్వు హ్యాపీగా ఉండడం కావాలి.. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఒకే అని శ్రీధర్ చెప్పాడు.
మరొకవైపు అసలు పెళ్లి చేసుకుంటావా లేదా అని జ్యోత్స్నని సుమిత్ర అడుగుతుంది. మీరు పంతులు చెప్పిన జాతకం గురించి నమ్ముతున్నారా అయితే నా పెళ్లి నెల రోజుల్లో అవుతుంది.. అది బావతోనే అని జ్యోత్స్న అనగానే అందరు షాక్ అవుతారు. దీప భర్త కార్తీక్ అని సుమిత్ర అంటుంది. నేను అలా అనుకోవడం లేదని జ్యోత్స్న అంటుంది. బావ నా మెడలో తాళి కట్టాడని దీప అనగానే ఈ తాళినే లేకుంటే అని దీప తాళిని జ్యోత్స్న పట్టుకుంటుంది. దాంతో జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది దీప. నా కూతురిని నా ముందు కొట్టె చొరవ తీసుకుంటావా.. కొడితే నేను కొట్టాలి గాని అని జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది సుమిత్ర. ఒక తల్లిగా మంచి పని చేసావని దశరథ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |