![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1017 లో...రాజు, లక్కీ, ఇందు, నందు నలుగురు కలిసి వంటలు తమ బడ్జెట్ లో ఎలా చెయ్యాలో ప్లాన్ చేస్తారు. చికెన్ అంతమందికి పెడితే సరిపోదని రాజు అంటాడు. ప్లేట్ లో వేస్తే సరిపోదు కానీ కప్ లో వేసిస్తే సరిపోతుందని ఇందు అంటుంది. అలా ఏమేమి వండాలో డిసైడ్ అవుతారు. మనం వెళ్లి ఈ వీధిలో వాళ్ళని పిలుద్దామని ఇందు అంటుంది. ఆ తర్వాత ఇందు, రాజు కలిసి పక్కింటి వాళ్లని పిల్వడానికి వెళ్తారు.
రాజుతో ఇందుని చూసి ఒరేయ్ నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకున్నావని అడుగుతారు. నేను పెళ్లి చేసుకోవడం కాదు మా అమ్మానాన్నల పెళ్లి రోజుకి భోజనాలు పెడుతున్నామని రాజు చెప్పగానే సరే తప్పకుండా వస్తామని వాళ్ళు చెప్తారు. మరొకవైపు నందు, వెంకీ వెళ్లి భోజనానికి రమ్మని పిలుస్తారు. ఆ తర్వాత మనకి ఇప్పుడు డబ్బులు ఎవరు ఇస్తారు.. ఆ ఇందుని ఎలా బయటకు తీసుకొని వస్తామని రేఖతో భూషణ్ అంటాడు. ఆ మాటలు అపర్ణ విని కోపంగా.. ఏంటి ఇందుని ఎలా బయటకు తీసుకొని వస్తామని అంటున్నారు. ఇన్ని రోజులుగా బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు.. నా ఇందు ని తీసుకొని రాలేదంటే పోలీస్ వాళ్ళకి , మీడియా వాళ్ళకి ఆఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తానని రేఖకి అపర్ణ వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత ఇందు పూజకి ఏర్పాట్లు చేస్తుంది. రాజు వాళ్ళ అమ్మానాన్న ఇద్దరు దేవుడికి మొక్కుకుంటారు. ఆ తర్వాత రాజు, వెంకీ వాళ్ళ అమ్మనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత వంటలకి సంబంధించిన కూరగాయలు కట్ చేస్తారు. అప్పుడే లక్కీ వస్తాడు. అక్కడ నందుని చూసి భయపడి రాజుకి సైగ చేస్తాడు. రాయితో కొడతాడు.. అలా కొట్టడం నందు చూసి లక్కీ వచ్చాడు వెళ్ళమని రాజుకి చెప్తుంది. తరువాయి భాగంలో రాజు కళ్లలో దుమ్ము పడుతుంది. ఇందు తనని పట్టుకొని తీసేస్తుంది. అది చూసి ఈ అమ్మాయి మన ఇంటికి కోడలు అయితే బాగుటుందని రాజు వాళ్ళ నాన్న తన భార్యతో అంటాడు. వాళ్ళ ఇద్దరికి బ్రహ్మముడి వేస్తే బాగుండు అని లక్ష్మీ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |