![]() |
![]() |
.webp)
వాట్ ది ఫిష్ అంటూ త్వరలో ఒక చాట్ షో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. హోస్ట్ గా పాగల్ పవిత్ర వచ్చింది. గెస్ట్ గా బిగ్ బాస్ దమ్ము శ్రీజ వచ్చింది. ఈ ప్రోమో చూస్తే ఇందులో పవిత్ర అడిగిన కొంటె ప్రశ్నలకు కొంటె ఆన్సర్స్ ఇచ్చింది శ్రీజ. "నువ్వు నీ లైఫ్ లో వాట్ ది ఫిష్ అనుకున్న సిట్యువేషన్ ఏంటి " "మొన్న బిగ్ బాస్ నుంచి నన్ను దొబ్బేయమన్నారు కదా" అది. "ఈమధ్య వస్తున్న వదలని కల ఏంటి " "మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తున్నట్టు " అని శ్రీజ అనేసరికి "అన్ని సార్లు పంపరమ్మా అంది పవిత్ర. "నీకు సూట్ అయ్యే సాంగ్ ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. అది నువ్వే పాడాలి " అంది పవిత్ర.
"ఎం మీ షో మూసేసుకోవాలనుకుంటున్నారా " అంది. " బిగ్ బాస్ కెమెరాలో క్యాచ్ చేయని ఏదైనా ఒక స్టోరీ చెప్పు అది ఎవ్వరిదైనా ఓకే" "మీరు బానే ఉంటారు నాకు కదా పోయేది " అంది. "జనగణమన అంటే ఏంటి వందేమాతరం అంటే ఏంటి " "మన స్కూల్ ప్రేయర్" "ఫ్లూట్ జింక ముందు ఊదు శ్రీజ దమ్ము ముందు కాదు" అంది శ్రీజ. "ఇప్పుడు బాలయ్య బాబు గారి డైలాగ్ " అంది పవిత్ర. "ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు " అంటూ ఆయన వాయిస్ లా ఇమిటేట్ చేసి చెప్పింది. "
"ఇప్పటి వరకు ప్రపంచంలో సెవెన్ వండర్స్ చూసాను నీ నవ్వుతో ఎనిమిదో వండర్ ని చూసాను " అని పవిత్ర అనేసరికి గట్టిగా నవ్వేసింది శ్రీజ. "దీని వల్ల వాడే కామెంట్ డిలీట్ చేస్తాడు " అంది. "ట్రాక్టర్ లో వెళ్ళా నీకు నడపడం వచ్చా " అడిగింది. "చాలా బాగా తీస్తాను ట్రాక్టర్ నడపడం వచ్చు కానీ స్టార్ట్ చేయడం ఒక్కటే రాదు" అనేసరికి పవిత్ర పడీపడీ నవ్వింది.
![]() |
![]() |