![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం(Jayam)'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-229 లో... సీతారాముల కళ్యాణం మీ చేతులు మీదుగా జరిపించండి అని దేవాలయ కార్యకర్తలు పెద్దసారు దగ్గరికి వస్తారు. అంతకు మించిన అదృష్టం ఏముంది.. ఏ లోటుపాట్లు లేకుండా జరిపిద్దామని పెద్దసారు అంటాడు. నా తర్వాత నా వారసుడుగా రుద్ర ఎప్పటికి ఉంటాడని పెద్దసారు అంటాడు. అలా ఎలా అవుతుంది.. మీ వారసుడిగా మన అల్లుడు వీరు ఉంటాడని శకుంతల అంటుంది. సీతారాముల కళ్యాణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మా అల్లుడు చూసుకుంటాడని శకుంతల చెప్తుంది.
కాసేపటికి దేవాలయ కార్యాకర్తలు వెళ్ళిపోతారు. వీరు అన్ని ఏర్పాట్లు నువ్వు చూసుకో కళ్యాణానికి సంబంధించిన వస్తువులన్నీ ఇషిక ఇందుమతి మీరు లిస్ట్ చెయ్యండి అని శకుంతల చెప్తుంది. రేపు సీతారాముల కళ్యాణం జరిపించాల్సింది మనం కాదు.. రుద్ర, గంగ అని పెద్దసారు అనగానే వద్దని శకుంతల అంటుంది. భాను ఉంటే వాడి చేతుల మీదుగా జరిపించే దానివి కదా అని పెద్దసారు అంటాడు. భాను అంటే మన వారసుడు అని శకుంతల అనగానే రుద్ర కూడా మన వారాసుడే అని పెద్దసారు అంటాడు. దాంతో శకుంతల కోపంగా వెళ్ళిపోతుంది.
మావయ్య గారు మీరు ఇంటిపెద్ద మీరు కళ్యాణం జరిపించకుంటే మా మావయ్య, అత్తయ్య గార్ల చేతుల మీదుగా జరిపించాలి కానీ రుద్ర బావ, గంగ వాళ్ళు ఎందుకని ఇషిక అంటుంది. చెప్పు అన్నయ్య అని రాఘవ అనగానే అందరు షాక్ అవుతారు. ఈ ఇంట్లో ఏ నిర్ణయం అయినా నేనే తీసుకుంటానని చెప్పు అన్నయ్య అని రాఘవ అనగానే ఇషిక షాక్ అవుతుంది. అవును బావ మీరు ఏం చేసిన కరెక్ట్ చేస్తారు.. ఈ ఇషిక ఏం తెలియకుండా మాట్లాడిందని ఇందుమతి అంటుంది. గంగ, రుద్రచే కళ్యాణం జరిపించడం మాకు ఇష్టమే కానీ వదినని ఒప్పించండి అని రాఘవ అంటాడు. దాంతో పెద్దసారు రాఘవని హగ్ చేసుకుంటాడు. మీకేనా బాండింగ్ మాక్కూడా అని రుద్ర దగ్గరికి సూర్య, వంశీ వెళ్లి హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |