![]() |
![]() |
.webp)
సింగర్ సునీతా అంటే చాలు ఆమె పాటలకే కాదు ఆమె ఆటిట్యూడ్ కి కూడా బోల్డంత మంది ఫాన్స్ ఉన్నారు. ఐతే ఆమె ఎవరి జోలికి పోదు. ఆమె లోకంలో ఆమె ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కుగా ఫీల్ గుడ్ రీల్స్ అండ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా అలాగే ఒక వీడియోని పోస్ట్ చేసింది తోటలో కూర్చుని పాట వింటూ. ఐతే ఒక నెటిజన్ మాత్రం కొంచెం అగ్రెసివ్ గా " మీ ఆయన ఎక్కడ ? ఎప్పుడూ సోలో రీల్స్ చేస్తున్నావ్.
మీరు సంతోషంగా ఉండడం నాకు నచ్చలేదు. సభ్య సమాజానికి ఎం మెసేజ్ ఇస్తున్నావ్ ? " అని అడిగేసరికి మరో నెటిజన్ సింగర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. " నచ్చక పోతే పక్కకెళ్లి ఆడుకోమ్మా.. ఆవిడ హ్యాపీనెస్ నీకు నచ్చలేదు అన్నావ్ కదా అక్కడే అర్ధమైంది నువ్వు ఒకళ్ళు హ్యాపీగా ఉంటే చూడలేవని" అని రిప్లై ఇచ్చారు. ఇలా కొంతమంది కించపరిచేలా మాట్లాడుతుంటే ఇంకొంతమంది జాగ్రత్తలు చెప్తున్నారు. "అలా ఎండిన అరటి చెట్లు దగ్గర పాములు కూడా అలాగే ఉంటాయి జాగ్రత్త మేడం ...మీరు ఏది చేసినా బాగుంటది మామ్ సూపర్ " అంటూ చెప్తున్నారు.
![]() |
![]() |