![]() |
![]() |
.webp)
సింగర్ సునీత ఏది చేసిన అందులో ఒక స్పెషాలిటీ ఉంటుంది. పాట పాడినా అంతే అందంగా ఉంటుంది. మాట్లాడినా అంతే జోష్ గా ఉంటుంది. ఇక సునీతకు ప్రకృతి అన్నా పువ్వులన్నా చాలా ఇష్టం. అలాంటి సునీత రీసెంట్ గా తన పొలంలో తిరుగుతూ సందడి చేస్తూ కనిపించింది. ఎప్పుడూ పాటలు పాడుతూ కనిపించే సునీత మొదటి సారి పుచ్చకాయ పంటపొలంలో తిరిగింది. పుచ్చకాయలు కూడా పాటలు నేర్పిస్తోందా సునీత అన్నట్టుగా ఉంది ఆ పిక్ ని చూస్తే. అన్ని రకాల పుచ్చకాయల్ని చూస్తూ కొంచెం పెద్ద సైజులో ఉన్న పండిన పుచ్చకాయల్ని తెంపింది. ఒక పుచ్చకాయని అక్కడే పంటపొలాల్లో కోసుకుని తిన్నది.
సునీత ఈ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. నెటిజన్స్ ఆ వీడియోని చూసి చాలా కామెంట్స్ పెట్టారు." హలో సునీత గారు వ్యవసాయం చేసే పొలంలో చెప్పులు వేసుకోకూడదు...ఆ హెయిర్ స్టైల్ బాలేదు..ఒక్కసారి జడ వేసుకోండి ప్లీజ్...మాకు లేవా పుచ్చకాయలు" అని అడుగుతున్నారు. అలాగే సునీత ఒక మెమొరీని కూడా షేర్ చేశారు. "నా కెరీర్లో మరపురాని క్షణాలలో ఒకటి.. 2014లో "ఏం సందేహం లేదు" అనే సాంగ్ కి గాను రేడియో మిర్చి అవార్డు అందుకున్నాను. ఇక్కడ నా అభిమాన సహ గాయకుడు కల్యాణి మాలిక్ ఉన్నారు. అవును ది మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్" అంటూ ఒక పిక్ ని పోస్ట్ చేసింది. ఇకపోతే సునీత ఎన్నో కస్టాలు పడినా ఫైనల్ గా చక్కగా సెటిల్ అయ్యింది. ఇప్పుడు తన పిల్లల్ని సెటిల్ చేసే పనిలో పడ్డారు. అలా ఆకాష్ ని హీరోని చేశారు. `సర్కారు నౌకరి` మూవీతో ఆడియన్స్ ని అలరించాడు. ఈ మూవీ ఈ ఏడాది రిలీజై ఒక మోస్తరు రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ చూసాక ఆమె ఆనంద బాష్పాలు కూడా రాల్చారు. సినిమా చూశాక చాలా గర్వంగా అనిపించిందన్నారు. హీరోగా ఆకాశ్ చాలా బాగా నటించడంతో కితాబిచ్చారు.
![]() |
![]() |