![]() |
![]() |
.webp)
గుడ్లు కావాలంటే ఫామ్ కే వెళ్ళాలా ఏంటి.. ఇంట్లో కూడా గుడ్లు దొరుకుతాయి. రోజుకో గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని ఎంతోమంది చెప్తుంటారు. అయితే ఎగ్స్ కావాలంటే మొదట ఫామ్ కి లేదా చికెన్ షాప్ కి గాని వెళ్తాం. అయితే శివజ్యోతి అలియాస్ జ్యోతక్క వాళ్ళింట్లో గుడ్లు పెట్టే కోడి ఉందంట. దాని గురించి ఓ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది శివజ్యోతి.
మూడు రోజుల క్రితం దుబాయ్ నుండి తిరిగొచ్చిన శివజ్యోతి.. పైసల్ అన్నీ కతం చేసుకొని ఇంటికి వచ్చినమ్ అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేయగా దానికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. అయితే తను దుబాయ్ లోని కొన్ని ప్రదేశాలలో తిరిగి షాపింగ్ చేసిందంట. అక్కడ ఎంత తిరిగిన ఇంకా షాపింగ్ చేయాలని ఉందని ఆ వ్లాగ్ లో చెప్పింది. అయితే తన భర్త గంగూలీతో కలిసి ప్రతీ ఇంట్లో భార్యాభర్తల మధ్య కామన్ గా జరిగే సంఘటనలని, చిన్న చిన్న గొడవలని యూట్యూబ్ లో కొన్ని షాట్స్ లో చెప్తుంటారు. అవి ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. ఇప్పుడు తను తీసుకొచ్చిన వస్తువలన్నీ అన్ బాక్సింగ్ చేస్తున్నప్పుడు మరో వ్లాగ్ చేసింది. అది ట్రెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడేమో ఇంట్లోనే గుడ్లు పెట్టే కోడి ఉందని చెప్పింది. రెండు డజన్ల గుడ్లు పట్టే ఓ కంటైనర్ ని ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిందంట శివజ్యోతి. ఇక ఓ కోడిని కూడా ఆర్డర్ పెట్టి ఆ గుడ్ల మీద పెట్టేసింది. దానిని చూసిన ప్రతీసారీ తనకి గుడ్లు అక్కడే ఉంటాయని గుర్తుంటుందంట అని శివజ్యోతి చెప్పుకొచ్చింది.
తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరు తో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో వల్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హోస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది.
![]() |
![]() |