![]() |
![]() |
.webp)
బిగ్‌బాస్ సీజన్-8 లో నిన్నటి ఎపిసోడ్ ఫుల్ మీల్స్ లా అనిపించింది. హౌస్‌లో ఇప్పటివరకూ కన్నడ గ్యాంగ్ మధ్య సరైన గొడవ జరగలేదు. మొన్న సోనియా వచ్చి నిఖిల్-యష్మీ మధ్య మంట రాజేసిన ఒక్కరోజులో అది ఆరిపోయింది. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో కన్నడ బ్యాచ్ వాళ్లలో వాళ్లే మంట పెట్టేసుకున్నారు. దీంతో అటు పృథ్వీ, ఇటు యష్మీ ఇద్దరూ మెగా చీఫ్ రేసు నుంచి తుస్సుమనిపించారు. రోహిణి కొత్త మెగా చీఫ్ అయిపోయింది. అయితే పృథ్వీకి వచ్చిన అవకాశాన్ని యష్మీ చెడగొట్టింది.
బిగ్ బాస్ మొదటగా 'ఆటో టాస్క్' ఇచ్చాడు. ఇందులో పృథ్వీ గెలిచాడు. ఇక రెండో టాస్క్ 'తెడ్డు మీద గ్లాస్'. ఈ టాస్కులో గెలవాలంటే కంటెండర్లు తెడ్డుపై గ్లాసులు పెట్టి వాటిని జిగ్‌జాగ్‌గా ఉన్న స్టాండ్ నుంచి అటు తీసుకెళ్లి తమ వాటర్ కంటెనర్‌లో వెయ్యాలి. ఇలా ఎవరైతే ఎక్కువ నీళ్లు నింపుతారో వారికి ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఇందులో రోహిణి గెలిచింది. ఈ గేమ్‌లో సరిగా పర్ఫామెన్స్ చేయకపోవడంతో మెగా చీఫ్ రేసు నుంచి విష్ణుప్రియ, యష్మీ ఇద్దరు తప్పుకున్నారు.
ఇక మెగా చీఫ్ కోసం ఫైనల్ రేసులో రోహిణి, పృథ్వీ, తేజ నిలిచారు. ఇక వీరికి బిగ్ బాస్ ఫైనల్ టాస్క్ ఇచ్చాడు. ఒక స్టాండ్ ఉంచి వాటి చివరన కుండ ఉంచి.. బజర్ మ్రోగిన తర్వాత ఒక్కో కంటెస్టెంట్ రెండు సార్లు ఇసుక పోయాలని, పోటీదారులు కుండని ఒక్క కాలుతో మాత్రమే బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పాడు. ఇక ఇందులో మొదట టేస్టీ తేజ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత పృథ్వీ, రోహిణి ఉన్నారు. ఇద్దరు చివరిదాకా కష్టపడ్డారు. కానీ పృథ్వీ బ్యాలెన్స్ చేయలేక అవుట్ అయ్యాడు. రోహిణి చివరి వరకు ఉండి విజయం సాధించింది. జీరో జీరో అంటు రోహిణిని విష్ణుప్రియ అవమానించింది.. దాని వల్లే తను కసిగా ఆడి గెలిచానని రోహిణి అంది. ఇక ఈ పోటీలో నబీల్, నిఖిల్, విష్ణుప్రియ అంతా పృథ్వీకే సపోర్ట్ చేశారు. కానీ గెలవలేదు. రోహిణి మాత్రం తన కాలు విరిగినా సరే బ్యాలెన్స్ చేసింది. టాస్క్ ముగిసిన తర్వాత తను చాలాసేపటి వరకు కుంటుతూనే నడిచింది. రోహిణి అటు ఎంటర్‌టైన్మెంట్ ఇటు టాస్క్.. ఏదైనా ఇరగదీయగలదని ఆడియన్స్ కి ఈ విజయంతో అర్థం అయ్యింది. ఇక బిగ్ బాస్ సీజన్-8 లో రోహిణి ఆఖరి మెగా ఛీఫ్ గా నిలిచింది.
![]() |
![]() |