![]() |
![]() |

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఎంటర్టైన్మెంట్ యాంకర్స్ వచ్చారు. వాళ్ళే యాంకర్స్ వింధ్య విశాఖ, శివ, ఆర్జే చైతు, సౌమ్య, ప్రశాంతి, గీతా భగత్. "మేమంతా ఏ స్ట్రీమ్ లో ఉన్నా కూడా మార్గదర్శి ఎవరంటే మా సుమ కనకాల" అంటూ స్టేజి మీదకు రాగానే చైతు సుమని మాటలతో పడేసాడు. ఇక శివ ఐతే సుమ కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టుకున్నాడు. " దేవుడు దీవించండి. నేను నీకెప్పుడు ఏమీ నేర్పించలేదు. నీకైతే ఏమీ నేర్పించలేను" అని భయపడిపోయింది సుమ. తర్వాత యాంకర్ ఆడిషన్స్ జరిగింది. ఇక శివ ఇంకో కమెడియన్ కలిసి బైక్ మీద వెళ్తూ కింద పడిపోయారు. వాళ్ళను యాంకర్ వింధ్య విశాఖ ఇంటర్వ్యూ చేసింది. "మేము లైవ్ కవరేజ్ చేస్తున్నాం. ఇంత బ్లడ్ ఎలా పాజిబుల్ అండి. ఎం తాగుతారు రోజు పొద్దున్న మీరు" అండి. "ఏమీ తాగడం కాదు కానీ మిమ్మల్ని చూసి పడ్డాను నిజానికి" అని చెప్పాడు శివ. "పడితే బ్లడ్ ఏ కలర్ లో ఉంటుంది. రెడ్, బ్లాక్, ఎల్లో, ఓరేంజ్ మీరంతా ఓట్లు చేస్తూ ఉండండి" అని చెప్పింది. "నొప్పి ఎలా ఉందండి. అబ్బా, అబ్బ" అన్నట్టుగా ఉందా అని అడిగింది. "మిమ్మల్ని చూడగానే అబ్బ అనిపించింది" అన్నాడు.
ఇక ఫైనల్ గా రాపిడ్ ఫైర్ రౌండ్ వచ్చింది. "పెళ్లి తర్వాత యాంకర్ వృత్తికి సౌమ్య దూరంగా ఉండడానికి గల కారణం ..ఏ. భర్త ఒప్పుకోకపోవడం వలన బి. యాంకరింగ్ మీద ఇంటరెస్ట్ తగ్గడం వలన" అని అడిగింది సుమ. భర్త వద్దనడం వలన అంటే బెటర్ అని ఆన్సర్ ఇచ్చింది. తర్వాత ఆర్జే చైతు వచ్చాడు "వీరిద్దరిలో నేను అనవసరంగా స్నేహం చేసాను అని అనిపించే వ్యక్తి ఎవరు..అవినాష్ లేదా శ్రీముఖి" అని అడిగింది. "ఒకళ్ళు నిన్ను నోటితో, ఇంకొకళ్ళు ముక్కుతో చంపేస్తారు" అంది సుమ. దాంతో చైతు ఆమ్మో అంటూ నవ్వేసాడు. తర్వాత శివ వంతు వచ్చింది.."శివ ఇంటర్వ్యూస్ లో కాంట్రావర్సీ చేసేది కేవలం డబ్బులు కోసం, ఫేమస్ అవ్వడం కోసం." అని అడిగింది సుమ. "డబ్బులు కోసం" అని శివ చెప్పేసరికి. "ఫేమస్ అవ్వడం కోసం అందరి బతుకుల్ని బస్టాండ్ చేసిన శివ" అంటూ ఆర్జే చైతు చెప్పాడు.
![]() |
![]() |