![]() |
![]() |
.webp)
ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో పంచ్ డైలాగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ఆటో రాంప్రసాద్, రోహిణి స్కిట్ లో డైలాగ్స్ మాములుగా లేవు...బాగా రిచ్ కిడ్ గా రోహిణి ఎంట్రీ ఇచ్చేసరికి ఆమెను పటాయించడానికి రాంప్రసాద్ వచ్చాడు. "బాగా డబ్బున్న వారిలా ఉన్నారు" అనేసరికి "మేము బంగారపు పళ్లెంలో తింటాం తెలుసా" అంది రోహిణి.."మేము డైరెక్ట్ గా బంగారాన్ని తినేస్తాం" అన్నాడు రాంప్రసాద్.."అరుగుతుందా" అని డౌట్ తో అడిగేసరికి "అరగకపోతే "కరిగించుకునైనా తాగేస్తాం" అంటూ బాగా డబ్బున్న వాడిలా పెద్ద బిల్డప్ ఇచ్చాడు. తర్వాత రోహిణిని కూర్చోబెట్టి "మీరు ప్రాపర్టీస్ కొంటూ ఉంటారా" అని అడిగాడు రాంప్రసాద్..."అవును కొంటుంటాం... ఏమయ్యింది" అనేసరికి.."అంటే ఏమీ లేదు మేము అమెజాన్ ఫారెస్ట్ ని అమ్మేద్దాం అనుకుంటున్నాం కొనుక్కుంటారేమో" అని అడిగాడు రాంప్రసాద్.
దానికి రోహిణి షాకైపోయి "అమెజాన్ ఫారెస్ట్ మీదా" అంది .."అవును మా నాన్న పేరు జాన్, అందుకే అమ్మజాన్, అమ్మజాన్ అని పిలిచేసరికి అది కాస్తా అమెజాన్ ఐపోయింది" అన్నాడు ఫన్నీగా రామ్ ప్రసాద్. ఇక వీళ్ళ స్కిట్ ఇలా నవ్వించబోతుంటే..తర్వాత వచ్చిన రాకింగ్ రాకేష్ స్కిట్ లో తెలంగాణ ఫ్రీ బస్సు ఇష్యూ మీద పంచ్ పేల్చాడు రాకేష్. గడ్డం నవీన్, సత్యశ్రీ, జ్ఞానేశ్వర్ ముగ్గురూ కలిసి రాకేష్ పంతులుని పిలిచి "లక్ష్మి దేవి ఇంటికి వచ్చే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి" అని అడిగారు. దాంతో రాకేష్ రెచ్చిపోయి అదిగో వచ్చేసింది అంటూ ఆయన పరిగెత్తి మిగతా వాళ్ళను పెరిగెత్తించి చివరికి తల పట్టుకుని "లక్ష్మి దేవి రావడానికి ఇబ్బంది పడుతోంది" అన్నాడు రాకేష్.."ఎందుకు గురువు గారు ఫ్రీ బస్సులోనే కదా రమ్మన్నాము" అని కౌంటర్ వేశాడు జ్ఞానేశ్వర్.
![]() |
![]() |