![]() |
![]() |

యాంకర్ ఉదయభాను.. ఈ పేరు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఒక్కప్పుడు ఏ సినిమా ఆడియో ఫంక్షన్ అయినా ఉదయభాను ఉండాల్సిందే. ఏ షో అయినా తను సందడి చెయ్యాల్సిందే అన్నట్లుగా ఉదయభాను క్రేజ్ ఉండేది. ఒకప్పుడు అన్ని ఛానల్స్ కు మోస్ట్ ఛాయస్ గా ఉదయభాను ఉండేది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను సంపాదించుకుంది. లీడర్ లో 'రాజశేఖర ' సాంగ్ లో కన్పించిన ఉదయభాను, ఆ తర్వాత జులాయి మూవీలో ఐటమ్ సాంగ్ లో మళ్ళీ మెరిసింది. అప్పట్లో రెండు మూడు సినిమాల్లో కనిపించి అందరిని మెప్పించింది. ఉదయభాను పెళ్లి చేసుకొని ఇద్దరి కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాగా కొంత కాలం బుల్లి తెరకి దూరంగా ఉంది.
ఉదయభాను సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా ఒక షో కి యాంకర్ గా చేసింది. ఇన్ని రోజులు ఫాన్స్ కి దూరంగా ఉన్నా ఇప్పుడు ఫ్యాన్స్ కి దగ్గర ఉండాలనుకుంది కాబోలు.. తనపేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. అందులో తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని వ్లాగ్ ల రూపంలో చేస్తూ వస్తుంది. ఉదయభాను ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకి దగ్గరగా ఉంటుంది. అయితే తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ ని క్రియేట్ చేసి అందులో ట్రెండింగ్ లో ఉన్న వాటికి సంబంధించిన వ్లాగ్ లు అప్లోడ్ చేస్తుంది. కాగా వాటికి అత్యధిక వ్యూస్ వస్తున్నాయి.
హోమ్ టూర్ వ్లాగ్, స్కిన్ కేర్ వ్లాగ్, సండే చికెన్ వ్లాగ్ ఇలా అటు బ్యూటీ కేర్, ఇటు ఫుడ్ ఇలా అన్ని కవర్ చేస్తుంది ఉదయభాను. అయితే తాజాగా 'ఏది దేశం తమ్ముడా' అనే పాటని ఉదయభాను రాసింది. తనే పాడింది. కాగా ఈ పాట కూడా వైరల్ అయింది. స్టార్ మా టీవీ కార్యక్రమాల్లో భాగంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఒక ఈవెంట్ లో పాల్గొంది ఉదయభాను. అయితే ఇప్పుడు తాజాగా వ్యవసాయం చేస్తున్నట్టుగా ఒక వీడీయోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఉదయభాను. కలుపు తీస్తున్నా అని ఉదయభాను పోస్ట్ చేయగానే తన అభిమానులు.. సూపర్ మేడమ్, మీరు గ్రేట్ అంటూ కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.
![]() |
![]() |