![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -366 లో.. అందరు రెడీ అయి భోగి మంటల దగ్గరికి వస్తారు. శకుంతల సంతోషంగా భోగి మంటల కోసం ఏర్పాట్లు చేస్తుంది.. అప్పుడే భవాని కూడా వస్తుంది. అందరు సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉంటారు. ముకుంద ఒక్కతే ఇంట్లో ఉండి చూస్తు ఉంటుంది. ముకుందని చూసిన కృష్ణ.. అత్తయ్య ముకుంద ఒక్కతే ఇంట్లో ఉంది. పాపం ఫీల్ అవుతుంది. నేను వెళ్లి తీసుకొని వస్తానంటూ కృష్ణ వెళ్తుంది.
ఆ తర్వాత ముకుందని కృష్ణ రమ్మని పిలుస్తుంది. నేను రాను అక్కడ నీకు ఒకదానికే నేను ఇష్టం.. ఎవరికి నేను ఇష్టం లేనని ముకుంద అంటుంది. అలా ఎం లేదని కృష్ణ చెప్పి ముకుందని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత అందరు సరదాగా డాన్స్ చేస్తుంటారు. కృష్ణ, మురారి మాత్రం మాస్టారు మాస్టారు అంటూ రొమాంటిక్ గా డాన్స్ చేస్తుంటారు. ఆ తర్వాత నందు, గౌతమ్ లు చెయ్యగా.. కాసేపటికి షకుంతల కూడా డాన్స్ చేస్తుంటుంది. తను డ్యాన్స్ చేస్తుండటం చూసి అందరు ఆశ్చర్యంగా చూస్తుంటారు. చివరగా అందరు కలిసి డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు.
ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం కృష్ణ లేచి ముగ్గు వేస్తుంటే తన దగ్గరికి మురారి వచ్చి... కృష్ణని పొగుడుతూ ఉంటాడు. చాలా అందంగా ఉన్నావంటూ కృష్ణని పొగుడుతూ ఉంటాడు. ఆ తర్వాత రేవతి పెద్దమ్మ నువ్వు ఈ రోజు చాలా అందంగా ఉన్నావ్. ఈ చీరతోనే వచ్చిన అందం కాదు.. నీ కొడుకు కోడలు కలిసిపోయారు దానివల్ల వచ్చిన అందమేమోనని మధు అంటాడు. ఆ తర్వాత నువ్వు మా అమ్మవి అని రేవతిని కృష్ణ హగ్ చేసుకుంటుంది. అందరు రెడీ అయి వచ్చి సరదాగా మాట్లాడుకుంటు ఉంటారు. సరదాగా ఈరోజు అరిటాకులో కింద కూర్చొని భోజనం చేద్దామని భవాని అంటుంది. ఆ తర్వాత భవాని అందరికి భోజనం వడ్డీస్తుంది. మురారి, మధు ఇద్దరు సెటైర్ లు వేస్తుంటే.. నువ్వు వడ్డించు అంటు కృష్ణకి భవాని ఇస్తుంది. తరువాయి భాగంలో కృష్ణ, మురారి ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. కృష్ణ హారతి ఇస్తు ముకుందకి పట్టుకోమని ఇస్తుంది. అప్పుడే దీపం ఆరిపోతుంది. అందరు షాక్ అవుతారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |