![]() |
![]() |
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -171 లో... గంగ ఇంటిముందు ముగ్గు వేస్తుంది. అది చూసి ఇంట్లోని వాళ్ళంతా చాలా బాగుందని పొగుడుతారు. కాసేపటికి గంగ భోగిమంటలు వేస్తుంది. పారు మండుతున్న కర్రని గంగ వైపుకి అంటుంది. దాంతో కర్రని గంగపై పడకుండా రుద్ర కాపాడుతాడు. గంగ నీకేం కాలేదు కదా అని రుద్ర అడుగుతాడు. ఏం కాలేదు సర్ అని గంగ చెప్తుంది. భోగి మంటలు పెడితే మంచి జరుగుతుందన్నారు ఇదేనా మంచి అని పారు అనగానే గంగకి ఏం కాలేదు అదే మంచి అని రుద్ర అంటాడు.
అప్పుడే సూపర్ మార్కెట్ కి ఇన్సూరెన్స్ వచ్చిందని పెద్దసారుకి ఎవరో ఫోన్ చేసి చెప్తారు. దాంతో పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతూ.. మంచి అన్నావ్ కదా ఇదే అని పారుతో పెద్దసారు అంటాడు. ఆ తర్వాత పెద్దసారు అందరికి బట్టలు తీసుకొని వచ్చి ఇస్తాడు. పారుకి శకుంతల ఇస్తుంది. పైడి రాజు, లక్ష్మీకీ కూడా పెద్దసారు బట్టలు తీసుకొని వచ్చి ఇస్తాడు. ఆ తర్వాత ఏంటి సర్ మీరు నాకు మంట అంటుకుంటుందని టెన్షన్ పడ్డారు.. ఎందుకు సర్ అని రుద్రని గంగ అడుగుతుంది. అదేం లేదు నువ్వు ఎప్పుడు అలాంటి తింగరి పనులు చేస్తావని అని చెప్పి రుద్ర వెళ్ళిపోతాడు. మరొకవైపు మీరేం ప్లాన్ చేస్తున్నారు. ఆ రుద్ర, గంగ ఒకటవుతున్నారని ఇషిక, వీరులపై పారు సీరియస్ అవుతుంది. ఆ తర్వాత గంగ కిచెన్ లో ప్రసాదం చేస్తుంటుంది.. ప్రీతీ వచ్చి వర్క్ చేస్తుంటే వద్దని చెప్పి అటువైపు గంగను వెళ్ళేలా ప్లాన్ చేస్తుంది ఇషిక. ఇక గంగ అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ గ్యాస్ ఎక్కువ పెట్టి ఇషిక, పారు వెళ్తారు. మళ్ళీ వచ్చి గంగ చూసుకోవా గారెలు మాడిపోతున్నాయని ఇషిక అనగానే వేడి ఆయిల్ లో చెయ్ పెట్టి గారెలు తీస్తుంది గంగ.
ఏంటి అలా తీస్తున్నావని ఇషిక అంటుంది. మరి మాడిపోతే అమ్మగారు తిడుతారని గంగ అంటుంది. నీకు ఏదైనా అయితే నన్నే అంటారని శకుంతల తనపై కోప్పడుతుంది. అ తర్వాత పేపర్ బిల్, పాల బిల్ ఇవ్వమని వస్తారు. గంగ అత్తయ్య ఇచ్చిన డబ్బు లో నుండి వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వమని ఇషిక చెప్పగానే గంగ తన గదిలోకి వెళ్తుంది. అక్కడ డబ్బు లేకపోవడంతో ఇంట్లో వాళ్ళకి వచ్చి విషయం చెప్తుంది గంగ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |