![]() |
![]() |

ఈ వారం ఢీ షో దుమ్ము రేపబోతుంది. ఈ నేపథ్యంలో మార్చ్ 6 న ప్రసారం కాబోయే ఢీ షో ప్రోమో రీసెంట్ గా రిలీజయ్యింది. మంచి డాన్స్, కామెడీతో మన ముందుకొస్తోంది. ఇక ఈ ప్రోమోలో నందూ హోస్టింగ్ వ్వావ్ అనిపించింది. ఎప్పటిలాగే కుమార్ మాస్టర్, ఆది తమ స్టయిల్లో కామెడీని పండించారు. ఇందులో కంటెస్టెంట్స్ చేసిన హాట్ పెర్ఫార్మెన్సెస్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కుమార్ మాష్టర్, ఆది కలిసి చేసిన కామెడీ అందరినీ నవ్వుకునేలా చేసింది. కుమార్ మాస్టర్ తెలుగును ఖూనీ చేస్తాడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాగే చేసాడు.
ఈ షోలో స్కూల్ స్కిట్ వేశారు. అందులో కుమార్ మాస్టర్ స్టూడెంట్ గెటప్ లో భుజానికి బాగ్, మెడలో వాటర్ బాటిల్ వేసుకుని వచ్చాడు. టీచర్ గా ఆది ఉన్నాడు. "ఎస్ కుస్ మీ" అని క్లాస్ లోకి రావడానికి అడిగేసరికి ఆది నవ్వేసుకున్నాడు. "ఏంటి లేట్" అనేసరికి "డబ్బులివ్వలేదని వదల్లేదామె" అన్నాడు. దానికి నవ్వుకున్నాడు ఆది. ఆ తర్వాత ఆది కుమార్ కు లెక్కల పాఠం చెప్తూ "రెండార్లు + మూడార్లు = ఎంత " అని అడిగేసరికి వెంటనే కుమార్ "తెల్లార్లు" అని కామెడీ ఆన్సర్ చెప్పడంతో అందరూ నవ్వేశారు. తర్వాత ఆది స్టూడెంట్స్ కి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చాడు "ఎవ్వడైనా చిట్టీలు గనక పెట్టారా..ఒక్కొక్కడు జుట్టు పట్టుకుని" అంటూ కుమార్ విగ్ ని లాగేసాడు. దాంతో కుమార్ బోడి గుండు మీద పెట్టుకున్న చిట్టీలన్నీ బయటపడ్డాయి. ఇలా వీళ్ళ స్కిట్ అలరించింది.
తరువాత "ఫ్రీ స్టైల్" రౌండ్ లో సునంద మాల "మౌనమే మౌనమే" అనే సాంగ్ కి చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి శేఖర్ మాస్టర్ హీటెక్కిపోయాడు. దాంతో పక్కనే ఉన్న వాటర్ బోటిల్ తీసుకుని గటగట తాగేశాడు. అది చూసిన ఆది "ఎంత దాహంతో ఉన్నారండి బాబు" అని డైలాగ్ వేసేసరికి హోస్ట్ నందు, శేఖర్ మాస్టర్ పడీపడీ నవ్వేసుకున్నారు. ఫైనల్ గా సహృద డాన్స్ ఎంతగానో అలరించింది. ఇక సహృద వాళ్ళ అమ్మ స్టేజి మీదకు వచ్చి తనకు ఇలాంటి బిడ్డ ఉన్నందుకు గర్వంగా ఉంది అని చెప్తూ కూతురి మీద ప్రేమను చాటుకుంది. ఈ షో ఎండింగ్ లో మదర్ సెంటిమెంట్ ఆడియన్స్ ఎంతగానో ఆకర్షించింది. సహృద ఆడియన్స్ అందరికీ తెలుసు... కార్తీక దీపం సీరియల్ తో మంచి పేరు తెచ్చుకుంది సహృద.
![]() |
![]() |