![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్ 9 సోసో నడుస్తోంది. ఐతే ఈ సీజన్ లో కామనర్స్ క్యాటగిరీ నుంచి కొంతమంది హౌస్ లోకి వెళ్లారు. కొంతమంది ఎలిమినేట్ ఇపోయారు. వారిలో శ్వేతా శెట్టి కూడా ఒకరు. ఐతే ఇప్పుడు ఆమె బిగ్ బాస్ మీద రివ్యూస్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. ఇక రీసెంట్ గా మనీష్ గురించి, డీమన్ పవన్, రీతూ గురించి గట్టిగానే చెప్పుకొచ్చింది. "అబ్బా లవ్ ట్రాక్ చూడలేకపోతున్నామండీ బాబోయ్...టూ మచ్.. కొంత లిమిట్ వరకు ఓకే. రీతూ, డీమన్ లవ్ స్టోరీ పులిహోరా...ఎవరు ఎవరికీ కలుపుతున్నారో..ఎవరు ఎందుకు కలుపుతున్నారో...ఇటు కలుపుతున్నారా, అటు కలుపుతున్నారా ఎన్ని లవ్ స్టోరీస్.. పవన్ కళ్యాణ్ రీతూ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె బుంగ మూతి పెట్టుకుంటుంది.
.webp)
డీమన్ దగ్గర బుంగ మూతి పెట్టుకుంటుంది.. ఇటొచ్చి నా మీద అలిగావా అంటూ వాళ్ళ కాన్వర్జేషన్స్ ..ఇవన్నీ కాకుండా జోక్ గా తనూజా- ఇమ్మానుయేల్ కాన్వర్జేషన్స్ ఎం లవ్ ట్రాక్ అండి చిరాకొస్తోంది...కొంతవరకు చూడగలం కానీ అర్ధమైపోతుంది ఇది ఫేక్ అని.. నాకు తెలిసి మొన్న డేంజర్ జోన్ లోకి వెళ్లిన దగ్గర నుంచి డీమన్ పవన్ ఇలా చేస్తున్నాడు. కానీ ఆ ఫేక్ నెస్ కనిపించేస్తోంది.
.webp)
కావాలని చేస్తున్నట్టు అనిపిస్తోంది. మరీ రోతగా అనిపించింది." అంటూ రీతూ- డీమన్ లవ్ స్టోరీస్ గురించి చెప్పుకొచ్చింది శ్వేతా శెట్టి. ఇక మనీష్ గురించి చెప్తూ శ్వేతా పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు. " అబ్బా మనీష్ రోజురోజుకూ ఎంత చెండాలంగా బిహేవ్ చేస్తున్నాడంటే..ఇమ్మానుయేల్ తో ఇష్యూ అయ్యింది కదా ఇప్పుడు బెడ్ షేర్ చేసుకోవచ్చా లేదా అని అడగడం ఎంత లూజ్ టంగ్ అంటే అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇంత లో స్టాండర్డ్స్ లో ఆలోచిస్తాడని నేను అస్సలు అనుకోలేదు. దానికి ఇమ్మాన్యూల్ ఏదో ఒక రిప్లయ్ ఇవ్వాల్సింది. ఇక ప్రియా గారు వాళ్ళు చూడండి నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారో అని చెప్తూ మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడ్డం.. మనీష్ ఎం అనుకుంటున్నాడో అర్ధం కావడం లేదు. కంప్లీట్ గా డిజాస్టర్ గేమ్ ప్లే చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే కావాలని భరణి గారితోనే ఎందుకు గొడవ పడుతున్నాడో నాకు అర్ధం కావట్లేదు. అతను సీనియర్ కాబట్టి గెలుస్తాడేమో అలంటి వాళ్ళతో అపోజిట్ గా పెట్టుకుంటే గెలుస్తానని థింక్ చేస్తున్నాడేమో..ఏమో ఓవర్ థింకింగ్ స్ట్రాటజీస్ కదా ఒక్కోసారి ప్లస్ అవుతాయి..ఒక్కోసారి మైనస్ అవుతాయి. బి కేర్ ఫుల్ మనీష్" అంటూ ఒక హెచ్చరిక చేసింది శ్వేతా.
![]() |
![]() |