![]() |
![]() |
బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అంటే ముందు అగ్నిపరీక్షను దాటాలి. దీని కోసం ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్స్ రన్నర్స్ అంతా వచ్చి వీడియోస్ చేస్తూ ఆడియన్స్ ని కామన్ మ్యాన్ ని మోటివేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమరదీప్, ప్రేరణ బిగ్ బాస్ గురించి చెప్పారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. "మీరంతా నన్ను ఇష్టపడి గెలిపించారు. అందుకే నేను విన్నర్ గా నిలిచాను. ఇంతవరకు మేము బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి ప్రతీ ఒక్కరినీ ఎంటర్టైన్ చేసాం. కానీ ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా వచ్చి ప్రతీ ఒక్కరినీ అలరించబోతున్నాడు. ఈ సీజన్ చాలా ట్విస్టులు, టాస్కులు, చాలా కొత్తగా రాబోతోంది. ఇంకో విషయం ఏంటంటే నోరు అదుపులో పెట్టుకుంటే జనాలు ఆదరిస్తారు. ఏ టాస్క్ ఐనా ఏదైనా మంచిగా ఆలోచిస్తూ ఆడాలి. మీరు హౌస్ లో గేమ్ ఆడుతోంది మీకోసం మిమ్మల్ని ఇష్టపడే జనాల కోసం అని గుర్తుపెట్టుకోవాలి. వేరే వాళ్ళ కోసం ఆడడానికి వచ్చామని అనుకోవద్దు. మీ మనసులో ఎం అనిపిస్తుందో అదే చేయండి. బిగ్ బాస్ కి వెళ్లేముందు అగ్నిపరీక్ష రాబోతోంది. అందులో ఇంటర్వ్యూస్ రావొచ్చు, టాస్కులు ఆడాలని రావొచ్చు..మీ మనస్తత్వాన్ని తెలుసుకునే క్షణాలు రావొచ్చు ఇవన్నీ దాటి ఎవరు గెలుస్తారో వాళ్ళే బిగ్ బాస్ సీజన్ 9 లో ఉంటారు. " అంటూ చెప్పాడు నిఖిల్.
![]() |
![]() |