![]() |
![]() |
బిగ్ బాస్ ప్రేక్షకులకు వీకెండ్ అంటే పండుగే. ఎందుకంటే ప్రతీ వారం మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్స్ ని నాగార్జున మెచ్చుకుంటూ.. పర్ఫామెన్స్ ఇవ్వని వాళ్లకి చివాట్లు పెడతాడు. అయితే ఈ వారం రీతూకి గట్టిగా ఇచ్చుకున్నాడు నాగార్జున. అసలు విషయానికి వస్తే రీతూకి పవన్ డిమాన్ కెప్టెన్ కావాలని ఉండే.. అందుకే తనకి ఫేవర్ గా నిర్ణయం చెప్పింది.
రంగు పడుద్ది టాస్క్ లో సంఛాలక్ మాట లెక్కచెయ్యకుండా ఆపండి అంటున్నా కూడా ఆపకుండా రంగు పూస్తున్నావంటూ భరణిని టాస్క్ నుండి తొలగించింది రీతూ. అసలు నిజం ఏంటంటే ఆపండి అన్నా ఆగకుండా రంగు పూసింది డీమాన్ పవన్. కానీ అతనే కెప్టెన్ అని ఫైనల్ లో చెప్పేసింది రీతూ. ఆ డెసిషన్ ఎంత మంది తప్పు అంటున్నారని అడుగగా అందరు తప్పు అనేదే అని అంటారు. అంతే కాకుండా టాస్క్ ముందు రీతూకి డీమాన్ పవన్ చాక్లెట్ తీసుకొని వచ్చి ఇవ్వడం నువ్వు కెప్టెన్ అయితే చూడాలని ఉందని రీతూ చెప్పడం అదంతా నాగార్జున వీడియో ప్లే చేసి చూపించడంతో రీతూకి మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు పాపం.
ఇక అంతా అయ్యాక నేను అప్పుడు అంత గమనించలేదని మెల్లిగా సారీ చెప్తుంది రీతూ. రాంగ్ డెసిషన్ వల్ల వచ్చిన కెప్టెన్సీ వద్దు సర్.. నేను ఆడి గెలుచుకుంటానని డీమాన్ పవన్ అనగానే నాగార్జున తన కెప్టెన్సీ రద్దు చేస్తాడు. కెప్టెన్ బ్యాండ్ తన దగ్గర నుండి తీసుకుంటాడు. ఇలా ఒక కెప్టెన్ ని రద్దు చెయ్యడమనేది బిగ్ బాస్ హిస్టరీలోనే మొదటిసారీ.
![]() |
![]() |