![]() |
![]() |
.webp)
అందం, చలాకీతనంతో బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతూనే.. వెండితెరపైనా తళుక్కున్న మెరుస్తూ.. షార్ట్ పీరియడ్‌లోనే స్టార్ సెలబ్రెటీగా మారిపోయింది అనసూయ. పర్సనల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఫ్యామిలీ అప్డేట్స్తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది ఈ అమ్మడు.
ఇన్ స్టాగ్రామ్ లో అనసూయకి యమక్రేజ్ ఉంది. అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ఆస్క్ మి క్వశ్చనింగ్ అంటూ మాట్లాడుతుంటుంది అనసూయ. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కొందరు నెటిజన్లు.. ఏం తింటారు, వర్కౌట్లు ఎలా చేస్తారు? ఏ ఫుడ్ అంటే ఇష్టం.. ఏ సినిమాలు చేస్తున్నారు.. బుల్లితెరపై ఇక కంటిన్యూగా వస్తారా? అంటూ ఇలా రకరకాల ప్రశ్నలు అడిగారు. వాటికి అనసూయ సమాధానమిచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించారట అని అడుగగా.. అది రిలీజ్ కావాల్సి ఉందని ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిచ్చారు. మరి అనసూయ నటించిన ఆ చిత్రం ఏంటో చెప్పలేదు. ఉస్తాద్, హరి హర వీరమల్లు, ఓజీల్లో ఏదో ఒక చిత్రంలో అనసూయ నటించినట్టుగా అయితే అర్థం అవుతోంది. బుల్లితెరపై రావడం ఆనందంగా ఉందని, ఇక కంటిన్యూగా షోలు చేయమని అభిమానులు రిక్వెస్ట్‌లు చేస్తున్నారు. అందరూ ఇలా తనను బుల్లితెరపై మిస్ అవుతున్నామని కామెంట్లు చేస్తుండటంతోనే మళ్లీ షోలు చేయడానికి బుల్లితెరకి వచ్చానని చెప్పుకొచ్చింది. కానీ తనకు ఇక్కడకు రావడంపై మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది.
నాకు వీలైనంత వరకు అందరినీ ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తానని మాటిచ్చింది. ఇక డైలీ జిమ్ చేస్తారా? అనే ప్రశ్నకు అనసూయ సమాధానమిచ్చింది. ప్రతీ రోజూ చేయాలని ఉంటుంది కానీ కుదరదు.. నా షెడ్యూల్స్, షూటింగ్‌లు.. నా ట్రైనర్ షెడ్యూల్స్ వల్ల ప్రతీ రోజూ చేయడం కుదరదు.. కానీ వారానికి మూడు సార్లు మాత్రం కంపల్సరీగా జిమ్ చేసేందుకు ప్రయత్నిస్తానని అంది. మీ మీద వచ్చే నెగెటివ్ కామెంట్లను ఎలా చూస్తారు? ఎలా తీసుకుంటారు? అని ఓ నెటిజన్ అడిగితే.. నా మీద ఇంకా నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయా? నాకు తెలీదే అని ఆశ్చర్యపోతోన్నట్టుగా అనసూయ సమాధానమిచ్చింది.
![]() |
![]() |