![]() |
![]() |
.webp)
అనసూయ పెట్టే ట్వీట్స్ ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. రీసెంట్ గా ఆమె పెట్టిన ఒక ట్వీట్ కూడా అలాగే వైరల్ అయ్యింది. "నాకు ఎదురైన అనుభవాన్ని, నేను చూసిన సంఘటనలను మాత్రమే షేర్ చేసుకున్నా తప్ప ఎవరిని నేను బ్లేమ్ చేసే ఉద్దేశం లేదు. అందరికీ అవగాహన కల్పించడం కోసమే మాట్లాడాను. ఆడియన్స్ కి, మీడియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒక్కటే దయచేసి ఎవరూ కూడా నా మాటలను వక్రీకరించి, నేను అనని మాటలను నేను అన్నట్టు ట్రోల్ చేయొద్దు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రమే నా ప్రేమను అందిస్తాను..
.webp)
ఇలాంటి మాటలు నా క్యారెక్టర్ ని డిసైడ్ చేయలేవు ” అంటూ ట్వీట్ పెట్టింది. ఐతే ఈ ట్వీట్ ని అనసూయ రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ కి సోషల్ మీడియాలో జరిగిన రచ్చకి సంబంధించి పెట్టింది. అనసూయ తన డ్రస్సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. బికినీ వేసుకుంటా లేదంటే మరొకటి చేస్తా మీకెందుకు అంటూ మాట్లాడిన విషయం తెలిసిందే. అనసూయ ఏది చేసినా, ఎం మాట్లాడినా బోల్డ్ గానే ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. రంగస్థలం, పుష్ప, విమానం, రజాకార్ వంటి మూవీస్ లో స్ట్రాంగ్ రోల్స్ చేసింది. మాట్లాడేటప్పుడు ఎలాంటి ఇన్హిబిషన్స్ ని పెట్టుకోదు...అనుకున్నది చెప్పేస్తుంది.
![]() |
![]() |