![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -25 లో..... అంజలి నీ పుట్టినరోజు ఎప్పుడమ్మ అని రాజారావ్ అడుగుతాడు. ఏం తాతయ్య తెలియదని అంజలి చెప్తుంది. అదేంటి అమ్మ నీ పుట్టినరోజు తెలియకపోవడం.. అసలు ఇన్ని రోజులు సెలబ్రేట్ చేసుకోలేదా అని రాజారావు అడుగుతాడు. నేను ఎప్పుడు పుట్టానో తెలియదు.. అనాధ ఆశ్రమానికి వచ్చిన రోజే నా పుట్టినరోజు.. అమ్మ వద్దని అనుకొని నన్ను పంపించేసిన రోజు పుట్టినరోజు ఎలా అవుతుంది.. చనిపోయిన రోజు అవుతుందని అంజలి ఏడుస్తుంది.
అంజలి ఏడుస్తుంటే పెద్దాయన ఏడుస్తాడు. అంజలి బయటకు వచ్చి ఏడుస్తుంటే మనీష్ చూసి ఎందుకు ఏడుస్తున్నావని అంజలి దగ్గరికి వచ్చి అడుగుతాడు. అంజలి సమాధానం చెప్పదు. తనని నవ్వించడానికి మనీష్ చాలా ట్రై చేస్తాడు. ఆ తర్వాత అమ్మ, కూతురు డ్రాయింగ్ ని చూపిస్తాడు. అది చూసి అంజలి నవ్వుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు మనీష్ నిద్ర లేచి తాతయ్య అంటూ పిలుస్తాడు. తాతయ్య అంజలిని తీసుకొని షాపింగ్ కి వెళ్ళాడని రత్నం చెప్పగానే మనీష్ టెన్షన్ పడుతూ రాజారావుకి ఫోన్ చేస్తాడు. తాతయ్య నువ్వు బయటకు ఎందుకు వెళ్ళావ్.. అంజలిని ఒకవేళ అత్తయ్య చూస్తే ఎలా.. ఇప్పుడు షాపింగ్ అవసరమా అని కోప్పడతాడు.
ఆ తర్వాత ఇప్పుడు నాకు బట్టలు ఎందుకు తాతయ్య అని అంజలి అంటుంది. ఈ రోజు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను.. అందుకే కొత్తబట్టలు కట్టుకొని ఉంటే బాగుంటుందని రాజారావు అంటాడు. నీ పుట్టినరోజు అని చెప్పి తనని సర్ ప్రైజ్ చెయ్యాలని రాజారావు అనుకుంటాడు. మా అమ్మ గురించి ఈ రోజు తాతయ్య చెప్తాడేమో అని అంజలి సరే అంటుంది కానీ ఇంత పెద్ద షాపింగ్ మాల్ లో వద్దు చిన్న షాప్ లో కొనండి అని అంజలి అనగానే రాజారావు సరే అంటాడు.అంజలి చీరలు సెలక్షన్ చేస్తుంటే వాళ్ళ అమ్మకి కూడా అలాంటి కలర్ అంటే ఇష్టమని రాజారావు అనుకుంటాడు. అప్పుడే మనీష్ వస్తాడు. తరువాయి భాగంలో ఫారెన్ నుంచి శివశంకర్ , కమల వస్తారు అప్పుడే రాజారావు అంజలి లోపలికి వస్తారు. ఎవరు నాన్న ఆ అమ్మాయి అని శివశంకర్ అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |