![]() |
![]() |

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఆడియన్స్ ని అలరించింది. ఇందులో ఒక నిబ్బా, నిబ్బి సెగ్మెంట్ ఐతే మాములుగా లేదు. " మీరంతా వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అన్నది ఆడియన్స్ చూడాలనుకుంటున్నారా. ఇప్పటికీ మీరు వయసులోనే ఉన్నారు కానీ ఆ వయసులో మీ ముఖంలో ఎంత నిబ్బాతనం ఎంత నిబ్బితనం కనిపించేదో చూద్దాం " అంటూ కొన్ని ఆ యంగ్ ఏజ్ లో ఉన్న ఫొటోస్ ని రివీల్ చేసింది.
ముందుగా గుప్పెడంత మనసు హీరో రిషి సర్ ఫోటో వేశారు. "ఏంటి ముఖేష్ అప్పటి నుంచి స్టైల్ స్వాగ్, స్లీవ్ లెస్ బనీన్ " అంది శ్రీముఖి. "ఫుల్ గోవా స్టైల్. అది 2013 లో ఫోటో. అంతా ఫ్రెండ్స్ " అని చెప్పాడు. "రక్షా నీ ఫీలింగ్ ఏంటి ఈ నిబ్బా ముకేశ్ మీద "అంది. "అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు " అని చెప్పింది. ముకేశ్ సెల్ఫీ ఫోటో రక్షా కోసం వేశారు. "అతని ఫేస్ లో ఇన్నోసెన్స్ ఉంది " అని చెప్పింది. "ఇప్పుడికీ ఉంది అంటే లేదు ఇప్పుడు లేదు అంది రక్షా. తర్వాత గుప్పెడంత మనసు హీరోయిన్ రక్ష ఫోటో వేశారు. "11 వ తరగతిలో ఫోటో అది. నేను అప్పట్లో ఫుల్ ఫీలింగ్స్ తో ఉండేదాన్ని. చాలా ప్రొపోజల్స్ వచ్చేవి. ఐతే రిజెక్ట్ చేయడంలో చాల హ్యాపీనెస్ ఉండేది." అని చెప్పింది.
వెంటనే పక్కనున్న మానస్ "కనిపించని శాడిస్ట్ ఉన్నాడు మీలో " అనేశాడు. తర్వాత సింగర్ సమీరా భరద్వాజ్ పిక్ వేశారు. అందులో ఫస్ట్ ఫొటోలో చాలా అమాయకంగా కూర్చుని ఉంటే సెకండ్ ఫొటోలో ఫుల్ పోష్ గా కనిపించింది. ఇక అవినాష్ ఆ ఫోటో వెనక పడ్డాడు. ఆ తర్వాత విరాజిత ఫోటో కూడా వేశారు. ఇక శ్రీహాన్ ఫోటో అస్సలు గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఆడిషన్స్ ఇచ్చే టైములో పిక్స్ అంటూ చెప్పాడు. ఇక నవ్య స్వామి ఫోటో ఐతే చెప్పక్కర్లేదు. ఆమె కంటే ఆమె కళ్లజోడే చాలా పెద్దగా ఉందంటూ అవినాష్ కూడా కామెంట్ చేసాడు. అలాగే మానస్, ఆషికా పిక్స్ వేశారు. ఆ తర్వాత అవినాష్, హరివి ఆధార్ కార్డులు వేససరికి అందరూ షాకైపోయారు.
![]() |
![]() |