Home  »  TV News  »  నువ్వు ట్రాన్స్ కదా అన్న బిందు మాధవి... 6 ప్యాక్ పెంచి బిగ్ బాస్ కి వస్తా.. ఉప్పల్ బాలు శపధం

Updated : Aug 15, 2026

సోషల్ మీడియాలో కొద్దీ రోజులు ఉప్పల్ బాలు నవదీప్ కి శాపనార్ధాలు పెట్టిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ అగ్నిపరీక్షకు ఉప్పల్ బాలు వెళ్లిన ఎపిసోడ్ చూస్తే అక్కడ నవదీప్ అతనికి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇక బాలు తన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాక " ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా అవన్నీ వెకిలి వీడియోస్ కదా " అన్నాడు నవదీప్. "మొదట్లో కొంచెం వల్గర్ గా చేసాను. తర్వాత చాలామంది చేంజ్ చేయమన్నారు. "నేను కూడా చేంజ్ చేసాను నేను చేంజ్ అయ్యాను. ఇలాగే ఎందుకు ఉండాలి కొంచెం మారాలి అని ఇప్పుడు అలాంటి వీడియోస్ చెయ్యట్లేదు. " అని చెప్పాడు, "బాలు ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ కి డబ్బులు కోసమా, ఫేమ్ కోసమా, ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నావా" అని అడిగింది శ్రీముఖి. "నిజం చెప్పాలంటే నా ఫాన్స్ చాలామంది బిగ్ బాస్ కి వేళ్ళు వెళ్ళు అని మెసేజెస్ పెడుతున్నారు. " అన్నాడు. "నిజంగా నమ్ముతున్నారా మీకు వాళ్లంతా ఫాన్స్ ఉన్నారని . మీ నుంచి చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారని నా ఫీలింగ్ జనరల్ బయట ఫీలింగ్ కూడా" అన్నాడు నవదీప్. ఇక బిందు మాధవి ఐతే "బాలు నువ్వు ట్రాన్స్ కదా " అని అడిగింది. "కాదు మేడం " అని చెప్పాడు. "కానీ అలా యాక్ట్ చేశారు వీడియోస్ లో " అని అన్నాడు నవదీప్. "డబ్బు కోసం నేను అలా నటించాను సర్" అన్నాడు బాలు . "మీరే చెప్తున్నారుగా డబ్బుల కోసం వల్గర్ గా వెకిలిగా వీడియోస్ చేసాను అని " అన్నాడు నవదీప్.

"అవును సర్ నా ఫామిలీ కోసం నా కోసం ఫుడ్డు కోసం చేసాను సర్ తప్పేముంది " అన్నాడు. "తప్పేం లేదు మీ పరిస్థితిల్లో ఎవరూ వచ్చి మీకు రూపాయి ఇవ్వలేదు. ఏది వర్కౌట్ అయ్యిందో అది చేశారు. జనాలు  చూసారు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మీకు డబ్బులు ఇచ్చారు. ఇదంతా ఓకే. ఇప్పుడు అగ్ని పరీక్షలో మిమ్మల్ని లోపలి పంపి సమాజానికి ఎం మెసేజ్ ఇవ్వాలి "
 అని అడిగాడు నవదీప్. "అంటే ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు కదా రెండు రోజులు టైం ఇస్తే  నేను కొంచెం మారతాను. అప్పుడు జనాలు ఉప్పల్ బాలు అంటే ఇలా కూడా ఉన్నాడా అనుకుంటారు " అన్నాడు. "కరెక్ట్ అంటే మీ ఇమేజ్ కరెక్షన్ కోసం మీరు ఎలాంటి వారు అనేది ప్రజలు తెలుసుకుంటారు అది మీకు మంచిది కాబట్టి మేము మిమ్మల్ని లోపలికి పంపాలని మీ ఉద్దేశం అంతేనా " అన్నాడు నవదీప్. "అదే నా కోరిక " అన్నాడు ఉప్పల్ బాలు. "కానీ ఇన్ని వేల మందిలో 15 మందిని మాత్రమే పంపాలి అన్న రెస్పాన్సిబిలిటీ ఉన్న మేము మిగతా వారిని చూసాం కాబట్టి నీకంటే వాళ్ళకే ఓటు వేస్తాను " అంటూ రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. బిందు మాధవి, అభిజిత్ కూడా రెడ్ ఇచ్చారు. "బాదేస్తుందా " అంటూ శ్రీముఖి అడిగింది. "నాకు అవకాశం రాలేదు కానీ బిగ్ బాస్ కి వెళ్లడం నా గోల్ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాను. మెయింటైన్ చేస్తాను. 6 ప్యాక్ కూడా ట్రై చేస్తాను " అని చెప్పాడు. "జిమ్ కి వెళ్లి 6 ప్యాక్ పెంచు అప్పుడు మొత్తం జనాలు షాకై షేకవుతారు అలాంటిది ఏదన్న చెయ్యి బాలు గుడ్ లక్ " అన్నాడు నవదీప్.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.