![]() |
![]() |

టిక్ టాక్ భాను సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్. ఒకప్పుడు ఆమె చేసిన టిక్ టాక్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. అలాంటి భాను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చింది. ఆ ప్రోమోలో ఆమె ఎన్నో విషయాలు చెప్పుకొచ్చింది. "ఆన్ స్క్రీన్ లో లిప్ లాక్ సీన్ వస్తే చేస్తావా..ఒక రొమాంటిక్ సాంగ్ చేయాలి " అంటూ హోస్ట్ వర్ష అడిగేసరికి "లిప్ లాక్ సీన్ చేయను.రొమాంటిక్ సాంగ్ ఒక ఎక్స్టెంట్ వరకు చేస్తాను " అని చెప్పింది భాను. "అంటే హీరోయిన్ గా చేయడం ఇష్టం లేదా" అని అడిగింది. "లేదు" అని చెప్పింది భాను. "నీ వీడియోస్ కింద చాలామంది కామెంట్స్ చేస్తారు..ఏంటి సినిమా ఆఫర్స్ కోసం ఇవన్నీ చేస్తున్నావా" అని అడుగుతుంటారు. "ఆఫర్ లు రావు అంటూ జనాలు ఎందుకు ఎప్పుడూ ఇలా కామెంట్ చేస్తారో అర్ధం కాదు..ఐనా ఎవరు అడిగారండి ఆఫర్ లు" అంటూ ఆన్సర్ ఇచ్చింది.
"నేను పుట్టింది గుంటూరు దగ్గర వినుకొండలో. పెరిగింది విజయవాడలో. దసరాలో ఏదో ఒక రోజు అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకుంటాను. నాకు శివయ్య అంటే ఇష్టం. మేము ఒక టెంపుల్ కడుతున్నాం. మా అమ్మ 17 ఏళ్ళ క్రితం నాగమ్మ కళ్యాణం చేసింది. ఇప్పుడు ఒక గుడి కడుతున్నారు. గుడి కట్టాలన్నది మా అమ్మ కల. మీ అందరికీ తెలిసిందే నేనొక ప్రోపర్ గుడ్ రిలేషన్ షిప్ లో ఉన్నాను. నాకు డబ్బు కన్నా నేను చేసుకోబోయే అబ్బాయే ఇంపార్టెంట్. నా కెరీర్ కన్నా నా బాయ్ ఫ్రెండ్ ఇంపార్టెంట్. నేను ఈరోజు ఇక్కడ కూర్చుని ఇంత మాట్లాడుతున్నాను. నేనొక కార్ లో వచ్చాను..ఇంత చేస్తున్నాను అంటే అదంతా నాకు మా అమ్మ ఇచ్చింది. లండన్ చదువుకుందామని వెళ్ళా ఐతే అక్కడికి వెళ్ళాక నాకు మా అమ్మ బాగా గుర్తొచ్చి ఏడ్చేసాను. ఎప్పుడైతే నీకు మీ పేరెంట్స్ తోడు ఉండరో..చాలా ఫేస్ చేస్తాం...ఎవరికీ చెప్పుకోవడానికి లేక" అంటూ చాలా విషయాలు చెప్పింది భాను.
![]() |
![]() |