![]() |
![]() |
.webp)
జబర్దస్త్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గ రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో కావాల్సిన వాళ్లకు కావాల్సినంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని వడ్డించి మరీ స్కిట్స్ వేశారు. తాగుబోతు రమేష్ రష్మీని చూసేసరికి గుర్రం సెకిలించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసేసరికి అందరూ నవ్వారు. "అబ్బా రష్మీ గారు ఎంత తాగినా ఎక్కదు కానీయండి మిమ్మల్ని చూస్తే మాత్రం ఫుల్ ఎక్కుతాది" అని అన్నాడు. దానికి రష్మీ కూడా పిలక సవరించుకుంటూ "ఆ మాత్రం ఉండాలిలే" అనేసరికి శివాజీ విరగబడి నవ్వేసాడు. ఇక ఇమ్ము స్కిట్ లో వర్ష పండుతో "తిన్నారా" అని అడిగేసరికి "తింటా రా" అన్నాడు. "నాకు చిరంజీవిగారు ఇష్టం..ఆయన ఒక సినిమాలో లుంగీ ఎత్తి కడతారు కదా అది కావాలి" అని వర్షా అనేసరికి "లుంగీ ఎత్తమంటారా" అంటూ పండు రెడీ ఐపోయాడు.
ఇక యాదమ్మ రాజు స్కిట్ లో ఐతే యాదమ్మ రాజు లేడీ గెటప్ వేసుకుని వచ్చి "యాడున్నావ్..వచ్చేయి మా ఇంట్లో మా ఆయన లేడు" అని తన బాయ్ ఫ్రెండ్ పండును పిలిపించుకున్నాది. ఇక బులెట్ భాస్కర్ స్కిట్ లో భాస్కర్ కి హీరోయిన్ గా ముంబై నుంచి ఎవరూ రాకపోయేసరికి తన్మయ్ ని పిలిపించాడు. దానికి ఖుష్బూ "అంతే ఆ రేంజ్ నీకు" అంటూ కామెంట్ చేసింది. ఇక సినిమా పేరైతే "రాడ్..ఈ ఉగాదికి దింపుతున్నాం" అని పెట్టారు. అదేదో సంక్రాంతికి వస్తున్నాం అన్న రేంజ్ లో పెట్టారు. తర్వాత రాఘవ "లడ్డూలో కిస్మిస్" అనే పేరుతో కొత్త ఛానల్ ని ఓపెన్ చేసాడు. ఇలా ఈ వారం జబర్దస్త్ వెరైటీ డైలాగ్స్ తో అలరించడానికి నెక్స్ట్ వీక్ మనముందుకు రాబోతోంది.
![]() |
![]() |