![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 754లో.. సూరజ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో జ్యోత్స్న, సూరజ్ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు. అయితే దాసు పారిజాతాన్ని పక్కకు తీసుకెళ్లి జ్యోత్స్నలో వచ్చిన మార్పును చూసి ఆనందపడతాడు. కానీ పారిజాతం మాత్రం పాత రహస్యాన్ని గుర్తుచేస్తూ..సూరజ్‌తో జ్యోత్స్న పెళ్లి అయితే ఆస్తి మొత్తం ఆమెకే దక్కుతుందని అంటుంది. దాంతో దాసు.. ఆ ఆస్తి అసలు దీపకి చెందాల్సింది కదమ్మా అని బాధపడతాడు. వాళ్లే ఆస్తి వద్దన్నారు.. ఇప్పుడు ఈ విషయాలన్నీ వదిలేసి సైలెంట్‌గా ఉండు. జ్యోత్స్న నిజమైన మనవరాలు కాదని మాత్రం ఎవరికీ చెప్పకని దాస్ తో పారిజాతం చెప్తుంది. దానికి దాసు.. చేసిన పాపం ఎప్పటికైనా బయటపడాల్సిందే అంటూ వెళ్లిపోతాడు.
ఇక జ్యోత్స్నలో వచ్చిన మార్పును చూసి దీప, కార్తీక్‌లు సంతోషిస్తారు. నాలో మార్పు తీసుకొచ్చింది కాలం కాదు.. మీరిద్దరూ. పెళ్లే వద్దనుకున్న నాకు కొత్త జీవితంపై ఆశ కల్పించారంటూ జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. అప్పుడే వచ్చిన దాసును.. నాన్నా అని జ్యోత్స్న ప్రేమగా పిలవడంతో అతడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒకప్పుడు నిన్ను చూస్తే అసహ్యం అన్నావ్.. ఇప్పుడు మారిపోయావా అని అడగగా.. అప్పుడు నిజం తెలియని మైకంలో ఉన్నాను నాన్నా.. ఇప్పుడు కళ్లు తెరుచుకున్నాయని జ్యోత్స్న అంటుంది. తన కూతురిలో ఈ మార్పే చూడాలని అనుకున్నానని దాసు ఆనందంగా ఆమెను హత్తుకుంటాడు.
ఆ తర్వాత జ్యోత్స్న అందరిని ఆశ్చర్యపరుస్తూ పెద్ద నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే అసలు నిజాన్ని నేనే బయటపెడతాను. దీపే సుమిత్ర, దశరథల కూతురు అని.. నేను కళ్యాణి, దాసుల కూతుర్ని అని అందరికీ చెప్తాను. దీపకి దక్కాల్సింది దీపకే ఇస్తానని చెప్తుంది. దీంతో దాసు, దీప, కార్తీక్‌లు ఎమోషనల్ అవుతారు. దీపకి ఎలాంటి అన్యాయం జరగకూడదు.. నీ పెళ్లితో చాలా జీవితాలు మారాలని దాసు కోరగా.. మారిపోతాయి బాబాయ్.. జ్యోత్స్న పెళ్లి అందరి జీవితాల్లో ఆనందం నింపుతుందని దీప అంటుంది. జ్యోత్స్న కూడా.. నీ మాటే నా మాట అంటూ మాటిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |