![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి Brahmamudi . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 1115లో.. ఐశ్వర్య తనకు కూడా ఈ ఇంటి వారసత్వంలో హక్కు ఉందని, డబ్బులు ఇవ్వాలని ఇందుని అడుగుతుంది. కానీ తాతయ్య ఆపరేషన్ కోసం మాత్రమే డబ్బులు ఉంచానని ఇందు చెప్పడంతో ఐశ్వర్య తాతయ్యను అవమానిస్తూ మాట్లాడుతుంది. దీంతో కోపంతో ఊగిపోయిన ఇందు ఐశ్వర్యను చెంపదెబ్బ కొట్టి.. నన్ను ఎన్ని అన్నా భరిస్తాను.. కానీ తాతయ్య, నానమ్మను ముసలివాళ్లు అని అంటే మాత్రం ఊరుకోను. వాళ్లే ఈ కుటుంబానికి పునాది.. వాళ్ల వల్లే మనకు ఈ గుర్తింపు వచ్చిందంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
ఇందు మాటలకు నందు కూడా ఐశ్వర్యను మందలిస్తుంది. మరోవైపు శేషు మాత్రం పగలబడి నవ్వుతూ.. ఇందు ఇలా కొడుతుందని నీకు ముందే తెలుసు కదా.. అందుకే నువ్వు నేరుగా డబ్బులు అడగలేదు. భ్రమరంతో అడిగించావు.. కానీ నీ ప్లాన్ తెలియక ఆమె నిన్ను నమ్మేసిందంటూ రేఖను ఎగతాళి చేస్తాడు. రేఖ మాత్రం ఐశ్వర్యను మరింత రెచ్చగొట్టి.. ఇందు నిన్ను కొట్టింది కదా.. నువ్వు కూడా దాని సంగతి చూడమని అంటుంది. దీంతో ఐశ్వర్య కోపంగా.. త్వరలోనే దీని సంగతి చెప్తానంటూ వెళ్లిపోతుంది. రేఖ హ్యాపీగా ఫీల్ అవుతుంది.
తాతయ్యను ఇందు సమర్థించిన తీరు చూసి సుభాష్ ఎమోషనల్ అవుతాడు. అందరూ ముసలివాళ్లను భారంగా చూస్తున్నారు.. కానీ నువ్వు మాత్రం మా గురించి గొప్పగా చెప్పావు. అందుకే ఆనంద భాష్పాలు వస్తున్నాయని సుభాష్ చెప్తాడు. తాతయ్య.. మీరు మళ్లీ ఈ ఇంట్లో దర్జాగా తిరగడం నేను చూడాలి. మీరు నడవడం నేను చూడకపోయినా.. ఇక తప్పకుండా చూస్తానంటూ ఇందు ధైర్యం ఇస్తుంది. రాజు కూడా.. మీరు భయపడకండి తాతయ్య.. నేను మీకు తోడుగా ఉంటాను. మీరు ఈ ఇంట్లో నడవడం నా కళ్లతో చూస్తానని భరోసా ఇస్తాడు. మరోవైపు ఇందు-రాజుల పెళ్లి నిజమైన పెళ్లిగా ఎప్పుడు మారుతుందన్న ప్రశ్నకు.. ముందు తాతయ్య నడవాలి, నందు పోలీస్ అవ్వాలి, ఐశ్వర్యక్క మారాలి.. ఆ తర్వాత నిజం చెప్తానని ఇందు అంటుంది. హాస్పిటల్‌లో రాజు ట్రీట్‌మెంట్ ఇస్తున్న ఓ అమ్మాయిని చూపించడంతో ఆమెనే రాజు ప్రేమించిన అమ్మాయా అనే ఆసక్తి మొదలవుతుంది. మరోవైపు రాజు రేఖను ప్రశ్నిస్తూ.. నాకు అవసరం లేని వాటిని పట్టించుకోనని అంటున్నావు కదా.. అందుకే పుట్టిన బిడ్డను వదిలేశావా.. మదన్‌ని కూడా అవసరం లేదనిపిస్తే వదిలేస్తావా అని నిలదీస్తాడు. రేఖకు కోపం రావడంతో.. వాడు ప్రపంచానికి తెలిసిన బిడ్డ కాబట్టి మాత్రం వదులుకోలేవు కదా అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |