![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1110 లో.. ఇందు, నందు ఎంత చెప్పిన ఐశ్వర్య శశిని నమ్మడం మానదు. రేణును తీసుకొచ్చి.. శశి మంచి వాడు కాదు.. నిన్ను మోసం చేస్తున్నాడని చెప్పిస్తుంది. మిమ్మల్ని భయపెట్టి ఇలా చెప్పించి ఉంటారని శశి అంటుంది. దీంతో నందు శశినే తీసుకొచ్చి.. ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్ముతావు కదా? అని అడుగుతుంది. శశి మొదట.. వీళ్లు చెప్పింది నిజమే అని ఒప్పుకున్నా, వెంటనే మాట మార్చి.. నిన్న వీళ్లు నన్ను కొట్టారు.. మా కుటుంబ పరువు తీస్తామని బెదిరించారు.. అందుకే అలా చెప్పానని అంటాడు. ఐశ్వర్య మాత్రం.. నేను శశిని నమ్ముతున్నాను.. నేను శశిని ప్రేమిస్తున్నాను.. శశినే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్తుంది.
శశి కూడా.. మీరు ఏం అనుకున్నా సరే.. నేను ఐశ్వర్యనే పెళ్లి చేసుకుంటానని అంటాడు. దాంతో భ్రమరం అతడిని తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తుంది. శశి వెళ్లిపోయిన తర్వాత ఇందు అతడిని నిలదీస్తుంది. ఇందాక ఎందుకు అబద్ధం చెప్పావని అని అడుగుతుంది. నువ్వు నన్ను కొట్టావ్.. నా ఇగో హర్ట్ అయింది. ఇంతవరకు ఐశ్వర్యను మోసం చేసి వదిలేద్దామనుకున్నా.. కానీ ఇప్పుడు మీ దుగ్గిరాల ఇంటి పరువు, ప్రతిష్టలు పోగొడతానని శశి సవాల్ చేస్తాడు. నేను ఉండగా అది జరగనివ్వనని ఇందు చెప్పడంతో.. ఐశ్వర్య నన్నే నమ్ముతుంది.. నేను ఏం చేస్తానో చూడమని శశి సవాల్ విసురుతాడు. మరోవైపు రాజు, ఇందును మందలిస్తూ.. రాత్రే నాకు విషయం చెప్పొచ్చు కదా.. వాడి నిజస్వరూపం బయటపెట్టేవాడిని అని అంటాడు. ఇందు కూడా.. రాత్రి నీకే ఫోన్ చేశాను.. నువ్వే పట్టించుకోలేదంటూ కోప్పడుతుంది.
మరోవైపు లక్కీ తన తల్లి కోసం రేఖను వేడుకుంటాడు. అమ్మని చూడాలని ఉంది మేడం.. దయచేసి మా అమ్మని వెతికి పెట్టండి.. కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటానంటూ రేఖ కాళ్లు పట్టుకోవడంతో ఆమె కరిగిపోతుంది. ఇంతలో మదన్ వచ్చి లక్కీని అవమానిస్తూ.. నీ తల్లి నిన్ను వదిలేసిందంటే.. ఆమె తప్పుదారిలో కన్నది అని అంటాడు. కోపంతో లక్కీ మదన్ కాలర్ పట్టుకోగా, మదన్ కొట్టబోతుండటంతో రేఖ అడ్డుకుంటుంది. వీడి కోసం నన్ను అడ్డుకుంటావా అంటూ మదన్ వెళ్లిపోతాడు. అక్కడికి వచ్చిన రాజు లక్కీని ఓదార్చి.. నీ అమ్మ నీ గురించి ఆలోచిస్తుంది.. నీ అవమానాలన్నీ చూస్తుంది.. మీ అమ్మ తప్పకుండా వస్తుందని రాజ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |