Home  »  TV News  »  Brahmamudi : వెంకీని దూరం పెడుతున్న నందు.. లక్కీ, మదన్ మధ్య భీకర గొడవ!

Updated : Jul 29, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -నందు ఫోటో చూస్తూ వెంకీ బాధపడతాడు. అప్పుడే నందు ఫోన్ చేస్తుంటే వెంకీ కట్ చేస్తాడు. మళ్ళీ మళ్ళీ నందు ఫోన్ చేస్తుంటే వెంకీ లిఫ్ట్ చేస్తాడు. ఏంట్రా వెళ్ళినప్పటి నుంచి ఫోన్ లేదని నందు అంటుంది. సరే గానీ రెడీగా ఉండు బయటకు వెళ్ళాలి వస్తున్నానని నందు అనగానే నాకు పని ఉందని వెంకీ అంటాడు. ఏంట్రా నేను దుగ్గిరాల అమ్మాయిని అని చెప్పినప్పటి నుంచి వేరేలా మాట్లాడుతున్నావని నందు అనగానే అదేం లేదు నాకు పని ఉందని చెప్పి కాల్ కట్ చేస్తాడు వెంకీ.

ఇక లేట్ చెయ్యకూడదు.. నేనే ఒక అడుగు ముందుకి వెయ్యాలని నందు అనుకుంటుంది. మరొకవైపు లక్కీ టీవీ చూస్తుంటే మదన్ వచ్చి రిమోట్ తీసుకుంటాడు. మదన్  ఫోన్ చూస్తూ ఉంటే లక్కీ రిమోట్ తీసుకుంటాడు. మదన్ కోప్పడడంతో లక్కి రిమోట్ విసిరేస్తాడు. ఏంట్రా విసిరేస్తున్నావని లక్కీని తక్కువ చేసి మాట్లాడుతాడు మదన్. తర్వాత లక్కీ కాలర్ పట్టుకుంటాడు మదన్. ఇక ఇద్దరి మధ్య గొడవ ముదిరి ఒకరి కాలర్ ఒకరు పట్టుకుంటారు. దాంతో అక్కడికి ఇంట్లోని వాళ్ళంతా వస్తారు. చెప్పానా వీడిని ఇంట్లో పెట్టి పెద్ద తప్పు చేసావ్ రేఖ అని భ్రమరాంబ అంటుంది. అసలు ఏం జరిగిందిరా అని రాజు అడిగితే లక్కీ జరిగింది చేప్తాడు.. అక్కడ మాధవ్ ది తప్పు అని రాజు అంటాడు. రేఖ  ఆ లక్కీ గాడిని కొట్టి వాడిని ఇంట్లో నుంచి పంపించేయ్ అని భ్రమరాంబ అంటుంది. రేఖ మాత్రం ఆ మదన్ ని కొట్టి నిన్ను ఇలాగే పెంచానా అని అతడిపై కోప్పడుతుంది. దాంతో మదన్ కోపంగా వెళ్ళిపోతాడు. నేను చూస్తుంది నిజమేనా.. రేఖ ఏంటి మాధన్ ని కొట్టిందని శేషుతో భ్రమరాంబ అంటుంది. తనెందుకో మారిపోయిందని శేషు అంటాడు. మరోవైపు కాలేజీలో ఐశ్వర్యని తన క్లాస్ మేట్ ఆస్తులు బాగా ఉన్నాయని ట్రాప్ చేస్తాడు.

ఇంట్లో ఉన్న రాజు, ఇందు మాట్లాడుకుంటారు. ఏంటి మన ప్లాన్ ఇలా అయింది.. ఆ లక్కీ గాడిని కొడితే పెద్ద గొడవ చెయ్యాలనుకున్నా కానీ రేఖ పిన్ని ఇలా చేసిందని ఇందుతో రాజు అంటాడు. తను అంత టెన్షన్ లో చాలా తెలివిగా ప్రవర్తించిందని ఇందు అంటుంది. మరొకవైపు మదన్ బాధపడుతుంటే తన దగ్గరికి రేఖ వెళ్తుంది. ఎందుకు మమ్మీ నువ్వు ఇలా మారిపోయావని ఎమోషనల్ గా మాట్లాడతాడు. తరువాయి భాగంలో బల్లిని చూసిన రాజు భయపడి ఇందు ఒళ్ళో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.