Home  »  TV News  »  Illu illalu pillalu : ప్రేమకు పోలీస్ ఎన్‌క్వైరీ నోటీస్.. సాగర్ లంచం భాగోతం!

Updated : Jul 16, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -524 లో.... ప్రేమని తీసుకొని ధీరజ్ పోలీస్ కోచింగ్ దగ్గరికి వెళ్తాడు. క్లాస్ లోకి వెళ్లేందుకు ప్రేమ భయపడుతుంటే క్లాస్ వరకు వచ్చి పంపిస్తాడు. ఏంటి చిన్నపిల్లలాగా తనని క్లాస్ వరకు వచ్చి పంపిస్తున్నారని అక్కడ సర్ అంటుంటే తను ఇంట్లో చాల గారాబంగా పెరిగింది సర్ అందుకే అని ధీరజ్ అంటాడు.

ఆ తర్వాత ప్రేమ క్లాస్ లో కూర్చొని ఉంటుంది. ధీరజ్ కిటికీ నుంచి చూసేసరికి ప్రేమ నిద్రపోతు ఉంటుంది. అది చూసి తనకి నిద్ర రాకుండా టీ తీసుకొని వస్తాడు. అలా ఏదో ఒకటి తనకి తీసుకొని వస్తుంటే అందరు నవ్వుకుంటారు. మరొకవైపు సాగర్ దగ్గరికి ఒకతను వచ్చి లంచం ఇచ్చి సంతకం పెట్టమని చెప్తాడు. దాంతో సాగర్ అక్కడ క్లర్క్ ని పిలిచి.. ఏంటి ఇది అని అంటాడు. వచ్చిన అతన్ని గుమస్తా పక్కకి తీసుకొని వెళ్తాడు. అతను ఇచ్చిన డబ్బు గుమస్తా తీసుకొని వచ్చి సాగర్ కి ఇస్తాడు. సర్ ఇలా చేస్తేనే బాగుపడుతారు. మీరు ఆ ఫైల్ పై సంతకం పెట్టండి అని గుమస్తా అనగానే రామరాజు న్యాయం గురించి మాట్లాడిన మాటలు గుర్తుచేసుకొని ఆగిపోతాడు కానీ తర్వాత ఫైల్ పై సంతకం పెడుతాడు. గుమస్తా ఆ ఫైల్ తీసుకొని వెళ్లి అతనికి ఇస్తాడు. రిస్క్ చేశాను సర్ అని గుమస్తా అనగానే నీకేం ప్రాబ్లెమ్ రాదు పోతే తన జాబ్ పోతుందని అతను అంటాడు. మరొకవైపు రామరాజుకి వేదవతి కాఫీ తీసుకొని వస్తుంది. చాలా థాంక్స్ అండి ప్రేమ విషయం తనకి నచ్చింది చెయ్యమన్నందుకు అని వేదవతి అంటుంది. నువ్వు ఎప్పుడు ఏం అడగలేదు కదా అని రామరాజు అంటాడు. ఏవండీ మా అమ్మ పుట్టినరోజు మా ఇంట్లో చేసుకుందామని వేదవతి అనగానే నేను ఎందుకు వద్దని అంటానని రామరాజు అంటాడు.

అప్పుడే నర్మద వస్తుంది. ఇంతసేపు అవుతుంది. కోడలికి కాఫీ తేవాలని తెలియదా అని నర్మద అనగానే వేదవతి నవ్వుకుంటుంది. మరొకవైపు ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. అప్పుడే ప్రేమకి మోపిదేవి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. మీరు ఎనమిది నెలలు క్రితం ఇక్కడ లాడ్జ్ లో స్టే చేసినప్పుడు అక్కడ ఒక కేసు ఫైల్ అయింది. దాని గురించి మిమ్మల్ని ఎంక్వయిరీ చెయ్యాలని ఇన్స్పెక్టర్ చెప్తాడు. దాంతో ప్రేమ టెన్షన్ పడుతుంది. ధీరజ్ కీ చెప్తుంది ఇద్దరు కలిసి బయల్దేరతారు. ఆ విషయం నర్మదకి చెప్తారు. నర్మద ఆ విషయం వేదవతికి చెప్తుంది. వేదవతి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.