Home  »  TV News  »  Ye Devi Varamo Neevu : గీతాంజలిని అంజలి కలుస్తుందా..

Updated : Jul 7, 2026

స్టార్ మా టీవీలో కొత్తగా టెలికాస్ట్ అవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు(Ye Devi Varamo Neevu )'.  ఈ సీరియల్ ఎపిసోడ్-01 లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం. వైజాగ్ సిటీలో గీతాంజలి ఉంటుంది. గీతాంజలి పాత్రలో బిగ్ బాస్ ఫేమ్ సంజనా గల్రానీ నటిస్తోంది. గీతాంజలి ఒక అతడిని ప్రేమిస్తుంది. కానీ ఇద్దరు పెళ్ళి చేసుకోరు. అతను ఎక్కడికో వెళ్ళిపోతాడు. అయితే గీతాంజలి ప్రెగ్నెంట్ అవుతుంది. తన డెలివరీ సమయంలో కూడా అతను రాలేకపోవడంతో గీతాంజలి వాళ్ళ నాన్న దిగులుచెందుతాడు. 

ఇక అదే సమయంలో గీతాంజలి వాళ్ళ అన్నయ్య తనకు ధైర్యం చెప్తాడు. పెళ్ళి చేసుకోలేదు.. ప్రేమించినవాడు వస్తాడో రాడో తెలియదు.. పెళ్ళి కాకుండానే తల్లి అయిందని గీతాంజలి వాళ్ళ నాన్న బాధపడతాడు. ఎందుకు నాన్న బాధపడతావ్.. ఇంకా వాడు వస్తాడని నమ్ముతున్నావా అని అతను అనగానే గీతాంజలి నమ్ముతుంది కదరా.. మనం ఏం చేయలేమని గీతాంజలి వాళ్ళ నాన్న అంటాడు. ఇక అప్పుడే నర్స్ వచ్చి.. కడుపులోని బిడ్డ అడ్డం తిరిగింది .. ఆమె భర్తతో సంతకం పెట్టించండి అని చెప్పి గీతాంజలి వాళ్ళ నాన్నకి ఆమె  ఫైల్ ఇచ్చేసి వెళ్తుంది. ఇక గీతాంజలి వాళ్ళ అన్నయ్య తిడతాడు‌. ఇక కాసేపటికి గీతాంజలికి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఇక గీతాంజలి వాళ్ళ అన్నయ్య వచ్చి.. తనను తీసుకెళ్ళి ఒక అనాధాశ్రమానికి వెళ్తాడు. దాని పేరు శబరి అనాధ శరణాలయం. అక్కడ జానకమ్మ అనే ఆమె సుమారుగా ముప్పై మంది పిల్లలని చేరదీసి సాకుతుంది. అయితే అదే ఆశ్రమంలో గీతాంజలికి పుట్టిన పాపని తీసుకొస్తాడు. జానకమ్మకి పాపని అందజేసి ఒక చెక్ ఇచ్చేసి గీతాంజలి వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతాడు. తర్వాత అనాధాశ్రమం నడిపే జానకమ్మ ఆ పాపకి అంజలి అనే నామకరణం చేస్తుంది.  కొన్ని సంవత్సరాల తర్వాత అంజలి తన తల్లి కోసం తపన పడుతుంది‌. ఎవరో తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతుంది. కానీ తనకి తెలియదు. మరోవైపు గీతాంజలిని ప్రేమించిన అతను రాకపోయేసరికి ఆమె నాన్న, అన్నయ్య తనకు మరో సంబంధం తీసుకొస్తారు. 

ఇక కొన్నిసంవత్సరాల తర్వాత గీతాంజలి పేరు మీద ప్రతీ సిటీలో ఓ పెద్ద ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఉంటుంది. గీతాంజలికి ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు ఉంటాడు. చిన్న కూతురి పేరు కృష్ణజ. గీతాంజలి కొడుకు ఫంకీ లుక్ లో కాలేజీకి వెళ్తుంటే తనని ఆపి ఇలా కాదు సంస్కారంగా ఉండాలని చెప్తుంది. ఆ తర్వాత పెద్ద పాప ఏదో పార్టీకి చిన్న గౌన్ వేసుకుంటే‌ మోకాళ్ళ వరకు ఉండాలని గీతాంజలి అంటుంది. మరోవైపు శబరి అనాధాశ్రమానికి కొంతమంది రౌడీలు వచ్చి గొడవ చేస్తారు. ఏంటని జానకమ్మ అడిగితే ఈ స్థలంలో ఒక పెద్ద ఇనిస్టిట్యూట్ కట్టబోతున్నారు.. మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పారు. మా ఓనర్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు‌ మీరు ఖాళీ చేయకపోతే మీ అందరిని ఎలా పంపించాలో మాకు తెలుసని ఆ రౌడీలు అంటుంటే జానకమ్మ, అంజలి ఏం చేయలేకపోతారు. మరి అంజలి తమ ఆశ్రమం కోసం హైదరాబాద్ లో ఉన్న గీతాంజలి దగ్గరికి వెళ్తుందా.. అంజలి, గీతాంజలి ఎలా కలుస్తారనేది ఈ సీరియల్ మిగతా కథ. స్టార్ మా టీవీలో ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.