Home  »  TV News  »  Illu illalu pillalu : వల్లి గర్భం నాటకం బట్టబయలు.. సుకన్యకు షాకిచ్చిన నర్మద ప్లాన్!

Updated : Jul 7, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -516 లో..... ప్రేమ, ధీరజ్ వంక నర్మద కోపంగా చూస్తుంది. అక్క మీకు చెప్పకుండా వెళ్లినందుకు ఆల్రెడీ తిట్లు పడ్డాయ్.. నువ్వు కోపంగా చూడకు అక్క అని ప్రేమ అంటుంది. అప్పుడే నర్మద నవ్వేస్తుంది. నీ భర్త అంటే ఎంత ఇష్టమో తనని కష్టం నుంచి బయట పడెయ్యడానికి ఎంత దూరం అయినా వెళ్తావని ప్రేమతో నర్మద అంటుంది . అవును అక్క ఇంతకి ఆ వల్లి కడుపు సంగతి తేలుస్తానన్నావ్ ఏమైందని ప్రేమ అడుగుతుంది. అసలు వల్లి ప్రెగ్నెంట్ అనేది మొత్తం నాటకమని నర్మద జరిగింది మొత్తం చెప్తుంది.

అది విని ధీరజ్, ప్రేమ షాక్ అవుతారు. లేని కడుపుని ఉన్నట్లు క్రియేట్ చేసి ఎంత నాటకం ఆడారని ధీరజ్ అంటాడు. ఈ విషయాలన్ని అత్తయ్యకి చెప్తే నమ్మడం లేదని నర్మద అంటుంది. మనం ఇప్పుడు ఆధారాలు తీసుకొని రావాలని ముగ్గురు అనుకుంటారు. ఆ తర్వాత వల్లి నీరసంగా ఉందని వేదవతి జ్యూస్ చేస్తుంది. అదంతా ప్రేమ, నర్మద, ధీరజ్ చూసి ప్రేమ నువ్వు సీన్ లోకి ఎంట్రీ అవ్వాలని ధీరజ్ అంటాడు. అత్తయ్య నాక్కుడా జ్యూస్ అని అంటుంది. దాంతో వేదవతి జ్యూస్ ఇస్తుంది. ఆ జ్యూస్ లో ధీరజ్  ఏదో కలుపుతాడు. వదిన ఇప్పుడు మీరు సీన్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ధీరజ్ అంటాడు. ఆ జ్యూస్ నర్మద తీసుకొని వెళ్లి సుకన్యకి ఇస్తుంది. సుకన్య ఆ జ్యూస్ తాగి వాంథింగ్ చేసుకుంటుంది. ఏంటి సుక్కు ఏమైందని అందరు వస్తారు. ధీరజ్ వెంటనే డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. అప్పుడే డాక్టర్ మెరుపు తీగ వస్తుంది. సుకన్యని చూసి సుక్కు నువ్వు ప్రెగ్నెంట్ అని అంటుంది. దాంతో వల్లి, వేదవతి, తిరుపతి షాక్ అవుతారు ఒసేయ్ నేను ప్రెగ్నెంట్ ఏంటని సుకన్య కోప్పడుతుంది. ఏంటి సుక్కు అసలే పెద్ద డాక్టర్ తనతో అలా అనొచ్చా వల్లి ప్రెగ్నెంట్ పోయిందని చెప్పింది కూడా ఆ డాక్టరే అని నర్మద అంటుంది. నేను పెద్ద డాక్టర్ ని అని మెరుపు తీగ అంటుంది. అసలు ఇది డాక్టర్ కాదు వల్లి కడుపు విషయం బయటపడకుండా ఒక డ్రామా చేసామని సుకన్య చెప్తుంది. దాంతో వేదవతి, తిరుపతి షాక్ అవుతారు‌. రామరాజు అప్పుడు ఇంట్లో ఉండడు.

తర్వాత మెరుపు తీగని పంపిస్తారు. జరిగింది మొత్తం సుకన్య చెప్తుంది. అప్పుడే చందు కూడా వస్తాడు. అదంతా విని షాక్ అవుతాడు. వల్లిని ఇంట్లోకి రప్పించడానికి వాళ్ళు కలిసి చేసిన డ్రామా అని నర్మద అనగానే చూడండి అత్తయ్య ఎలా మాట్లాడుతుందో అని వల్లి అంటుంది. నోరు ముయ్ అని చందు తనని కొట్టబోతాడు. నేను చెప్పేది వినండి అని వల్లి అంటుంటే వేదవతి వచ్చి తన చెంపచెల్లుమనిపిస్తుంది. ఎంత సంతోషపడ్డామే అని వల్లిని వేదవతి తిడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.