![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి సిబ్లింగ్స్ స్పెషల్ గా రాబోతోంది. ఈటీవీ ప్రభాకర్ తో వాళ్ళ అన్నయ్య సీతారాములు, కావ్య - కేసరి, హరి తేజ - హరి నిత్యా, ఆషికా - అమోఘ్, ప్రియాంక జైన్ -జెనిల్ ఇమ్మానుయేల్ - డేనియల్ అందరూ వచ్చారు. ఇక శ్రీముఖి "ఇప్పటి వరకు మీకు జరిగిన అన్యాయాలు ఏమన్నా ఉంటె నాకు చెప్పండి " అంది. వెంటనే కావ్య వచ్చి కోర్ట్ బోనులో నిలబడి "నేను కాలేజ్ ఫ్రెండ్స్ తో ఒకసారి బంక్ కొట్టి నార్మల్ గా సెల్ఫీస్ దిగుతాం కదా అది మా అమ్మకు చెప్పేసింది. " అంది . "అమ్మకు చూపించడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ప్రైవసీ ఫొటోస్ ని పైరసీ చేసింది." అన్నాడు ఇమ్మానుయేల్. "అమ్మకు చూపించడం తప్పా జడ్జెస్ " అని హరి అడిగాడు.
"ప్రభాకర్ గారు మీ అన్న మీద ఏవైనా కంప్లైంట్స్ ఉన్నాయా " అని అడిగింది శ్రీముఖి. "ఆయన 10 వ తరగతిలోనే లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాడు. నేను పిజి తర్వాత లవ్ మ్యారేజ్ చేసుకుంటే మా నాన్నతో కలిసి కొట్టాడు నన్ను " అని చెప్పాడు ప్రభాకర్. "పనిష్మెంట్ ఏంటో తెలుసా చిన్నప్పుడు ఎలా కొట్టావో ఇప్పుడు ప్రభాకర్ ని అలాగే కొట్టు " అంటూ వాళ్ళ అన్నకు చెప్పింది . "10 వ తరగతికి పెళ్లయ్యింది అంటే ఎలా కొడతారూ నేను ఊహించగలను " అంటూ ఇమ్మానుయేల్ ని సీతారాములని ఆటపట్టించాడు. "
తర్వాత ఇమ్మానుయేల్ మీద వాళ్ళ అన్న డేనియల్ కంప్లైంట్ ఇచ్చాడు. "5 నుంచి హాస్టల్ లో జాయిన్ అయ్యి 10 వ తరగతిలో లవ్ చేసాడు." అని చెప్పాడు. ఇమ్మానుయేల్ కి కంప్లైంట్స్ ఉన్నాయని చెప్తే చెప్పండి అన్న శ్రీముఖి వెంటనే ఓవర్ రూల్డ్ అనేసింది. ఇక ప్రియాంక జైన్ తన తమ్ముడు జెనిల్ ని ఆడపిల్లల తయారు చేసింది. ఇక ఆషిక తన తమ్ముడు అమోఘ్ గురించి చెప్పింది. చిన్నప్పుడు డాన్స్ కాంపిటీషన్ ఉంటే చిన్న మినీ స్కర్ట్ వేసి ఐటెం గర్ల్ లా రెడీ చేసాను అని చెప్పింది. వెంటనే హరి అతన్ని ఐటెం గర్ల్ లా ఊహించుకుని షాకయ్యాడు.
![]() |
![]() |