![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-46 లో..... మా అమ్మ డబ్బు ఇస్తుందని జానూని సూర్య వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. కానీ జానూని భువన అవమానిస్తుంది. అమ్మ నువ్వు తప్పకుండా సాయం చేస్తావని తీసుకొని వచ్చానని సూర్య అనగానే వాళ్ళకి అప్పు ఇస్తే ఎలా తీరుస్తారు. ఎవరికి జాబ్ లేదు కదా అని భువన అంటుంది. డబ్బు అడగడానికి వచ్చాను అడుక్కోవడానికి కాదని జానూ అంటుంటే.. ఏయ్ అని భువన కోప్పడుతుంది. వేలు దింపు నాకు కోపం వస్తే నీకంటే వందరెట్లు క్రాక్ దాన్ని అని జానూ అంటుంది.
చూసావా సూర్య.. మీ అమ్మ అసలు స్వరూపమని జానూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు అమ్మ అని సూర్య అంటాడు. ఆ తర్వాత జానూ ఇంటికి వస్తుంది. సింహాద్రి తప్పక సాయం చేస్తాడనుకున్నా కానీ చెయ్యకపోవడం ఏంటని పెద్దావిడ అంటుంది. ఇప్పటికైనా అర్ధం అయిందా ఎవరు ఎలాంటి వారో అని శాంతి అంటుంది. మురళి తన ఇంటిపత్రాలు తీసుకొని వెళ్లి డబ్బు తీసుకొని రావాలని అనుకుంటాడు. దాంతో శాంతి చూసి వాళ్ళ కోసం ఇల్లు అమ్మాలనుకున్నావా అని కోప్పడుతుంది. మా కోసం మీరు ఇంటిని అమ్మొద్దని జానూ చెప్తుంది. ఇదంతా ఆ నందు వల్లే దాన్ని ప్రేమించి దానికోసం ఇదంతా అని శాంతి కోప్పడుతుంది. నేను ఏం మీ కొడుకుని చేసుకుంటానని అన్లేదని నందు అంటుంది. శాంతికి, నందు ఇద్దరికి గొడవ అవుతుంది. నందుని శాంతి కొడుతుంది. నందు మళ్ళీ తిరిగి కొట్టబోతుంటే జానూ ఆపుతుంది. నీకు సిగ్గు ఉంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవే అని శాంతి అంటుంది. దాంతో బ్యాగ్ తో నందు బయటకు వస్తుంది
తనకి జాను నచ్చజెప్పుతుంది. చిన్నప్పటి నుంచి తన చేతుల్లో పెరిగాం.. ఆ మాత్రం మనల్ని అనలేదా అని జానూ నచ్చజెప్పుతుంది. ఆ తర్వాత మనం ఇంటిని కాపాడుకోవాలంటే అక్క నీ నగలు ఇవ్వాలి.. నీకు మళ్ళీ ఆ నగలు తీసుకొని వచ్చి ఇస్తానని జానూ అనగానే నందు నగలు తీసుకొని వచ్చి ఇస్తుంది. తరువాయి భాగంలో వేలం దగ్గరికి జానూ డబ్బు తీసుకొని వస్తుంది. దాంతో సింహాద్రి షాక్ అవుతాడు. ఇప్పుడు వేలం ఆగదని అక్కడ వాళ్ళు అంటారు. దాంతో సూర్య కోర్ట్ నుంచి స్టే తీసుకొని వస్తామని అంటాడు. జానూ లాయర్ ని తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |