![]() |
![]() |
స్టార్ మా సీరియల్లో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్లో శుక్రవారం నాటి ఎపిసోడ్ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ ని, అన్న ఆదిని, తల్లి లలితని తిడుతుంది. ఆ తర్వాత ఇంటి నుండి బయటకు వస్తుంది. మరోవైపు చక్రిని రౌడీల భారీ నుండి కేశవ, మాధవ, కన్నా కాపడతారు. లేదంటే మనకు దక్కేవాడు కాదని మాధవ ఎమోషనల్ అవుతాడు.
ఇక కన్నా, కేశవ, మాధవ, చక్రి, మహా కలిసి ప్రతాప్ కార్లో వస్తుంటారు. ఎందుకు అందరు సైలెంట్‌గా ఉన్నారని మహా అనగానే రాత్రి అంతా నిద్దుర లేదని. అందుకే టైడ్ గా ఉన్నామని చక్రి అనగానే అవును అన్నట్టు అందరు అంటారు. ఆ తర్వాత మరుసటి ఎపిసోడ్ లో ప్రతాప్ కార్ డ్రైవర్ నారాయణ వాళ్ళంటికి వస్తాడు. అతడితో నారాయణ గొడవపడతాడు. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తాడు. అసలు ఎందుకిలా చేశాడో తెలియాలంటే సోమవారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను సరికొత్త ట్విస్టులతో ఆసక్తిని పెంచుతుంది.
మాధవ తను ప్రేమించిన అమ్మాయిని వద్దనడం.. తన తమ్ముళ్ళ కోసం కష్టపడి పనిచేయడం ఓ వైపు.. గొప్పింటి అమ్మాయి మహా.. తన కుటుంబంతో గొడవపడి బయటకు వచ్చేయడం, చక్రిని పెళ్ళి చేసుకొని మాధవ వాళ్ళ ఇంటికి రావడం నుండి ఈ సీరియల్ సూపర్ సక్సెస్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఈ కథని ఇంతమంది ఆడియన్స్ ఇష్టపడటానికి ముఖ్య కారణం గొప్పగా బ్రతికిన ఓ అమ్మాయి కటిక పేదరికాన్ని ఎలా గడుపుతుంది. తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సీరియల్ రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. ఈ సీరియల్ ప్రతీ పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా మహాని చక్రి వన్ సైడ్ లవ్ చేయడం.. ఎప్పటికి అయినా చక్రి ప్రేమని మహా అర్థం చేసుకుంటుందనే ట్విస్ట్ తో సీరియల్‌ని కొనసాగిస్తున్నాడు దర్శకుడు. మహా తను చదివిన చదువుకి మంచి జాబ్ చేయగలుగు తుందా లేదా అనే మరో క్యూరిసిటి ఎలిమెంట్ తో ఈ పొదరిల్లు ప్రతీ ఇంట భాగమైంది. మరి సోమవారం నాటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో కామెంట్ చేయండి.
![]() |
![]() |