![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -263 లో.....షష్ఠిపూర్తికి సంబంధించిన బాధ్యతలన్నీ అత్తయ్య నిన్ను చూసుకోమంటే అంత ఈజీగా రుద్ర బావ గారు ఒప్పుకున్నారు ఏంటని ఇషిక అంటుంది. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు.. ప్రతీదానికి తన ముందు చెయ్ చాపాలని తన ప్లాన్ అని వీరు అంటాడు. అప్పుడే వీరుకి తన అకౌంట్ లో యాభై లక్షలు పడుతాయి.. రుద్ర వచ్చి నేనే వేసాను.. నేను వేసినట్లు పెద్దమ్మకి తెలియద్దని వీరుతో రుద్ర అంటాడు. ఆ మాటలన్నీ ప్రీతి వింటుంది. ఆ తర్వాత నువ్వు మాట్లాడింది నేను మొత్తం విన్నాను అన్నయ్య చాలా హ్యాపీగా ఉందని ప్రీతి అంటుంది.
భాను ఉంటే కూడా ఇవన్నీ చేసేవాడు కదా అని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఎలాగైనా రుద్ర బాబుకి నిజం చెప్పాలని అనుకున్నాం కానీ అక్కడా జరిగింది చూసాక చెప్పకుండా ఉందే బెటర్ అయిందని లక్ష్మీ, పైడిరాజు అనుకుంటారు. అప్పుడే రంగా ఎదురుపడి ఏంటి ఆ నిజం అని అడుగుతారు. దాంతో వాళ్ళు కంగారుపడుతారు. అన్ని నిజాలు తెలిసిన నీకు ఈ నిజం తెలియకుండా ఎలా ఉంటుందని గంగ తల్లిదండ్రలు విశ్వ, సుధా అమ్మ అని లక్ష్మీ, పైడిరాజు చెప్తారు. దాంతో రంగా షాక్ అవుతాడు. నువ్వే రుద్ర బాబుకి విషయం చెప్పు అని లక్ష్మీ అంటుంది. ఈ విషయం ఇప్పుడు వెంటపడి మరి కనుకున్నాను.. ఇప్పుడు నా కడుపు ఉబ్బి పోయిందే అని రంగా అనుకుంటాడు.
మరొకవైపు సుధాకి గంగ ఫోన్ చేసి మాట్లాడుతుంది. పెద్దసారు ఫోన్ తీసుకొని రేపు మాకు షష్ఠిపూర్తి చేస్తున్నారు.. నువ్వు తప్పకుండా రావాలని అంటాడు. దానికి మా అయన ఏం అంటారోనని సుధా అంటుంది. ఇక రుద్ర ఫోన్ తీసుకొని నువ్వు వస్తున్నావ్ అంతే అని రుద్ర అంటాడు. మరొకవైపు పైడిరాజు, లక్ష్మీ ఇద్దరు విశ్వ దగ్గరికి వస్తారు. మీరు మీ రిలేషన్ బ్రేక్ చేసుకోవడం ఎందుకు.. రేపు షష్ఠిపూర్తికి వెళ్ళండి అని విశ్వ వాళ్ళకి పర్మిషన్ ఇస్తాడు. నువ్వు వెళ్తున్నావా అని సుధాని విశ్వ అడుగుతాడు. మనల్ని ఎందుకు పిలుస్తాడని సుధా అంటుంది. రేపు నాతో అకాడమీకి రా అని విశ్వ అనగానే నాకు గుడిలో కుంకుమ పూజ ఉంది వెళ్ళాలని అక్కడ నుండి వెళ్తుంది సుధాని ఇలాగే వదిలేస్తే తన కుటుంబానికి దగ్గర అవుతుందని విశ్వ అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |