![]() |
![]() |
.webp)
పటాస్, జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ లైఫ్ లో కొత్త చాప్టర్ స్టార్ట్ అయ్యింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ ద్వారా అతనికి విపరీతమైన క్రేజ్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే . ఈ షోలో ఇంద్రజతో ఒక మదర్ రిలేషన్ ఏర్పడడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమెను అమ్మలా భావించే ప్రవీణ్, తన ఎంగేజ్మెంట్ సందర్భంలో ఇంద్రజ నుంచి ప్రత్యేక ఆశీస్సులు అందుకోవడం అతనికి మరింత ఆనందాన్ని ఇచ్చింది.
ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న డ్యాన్సర్ వంశితని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దాంతో ఇప్పుడు ప్రవీణ్ నిశ్చితార్థం చేసుకున్నాడు . ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్‌గా మారాయి. తోటి బుల్లితెర నటీనటులు, స్నేహితులు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రష్మీ గౌతమ్, షబీనా, సత్య శ్రీ వంటి వారు హృదయపూర్వకంగా విషెస్ చెప్పారు. ప్రవీణ్ ప్రయాణం పటాస్ అనే షోతో స్టార్ట్ అయ్యింది తర్వాత జబర్దస్త్ లో మంచి కామెడీ టైమింగ్ తో అందరినీ అలరించాడు. ఆర్ధికంగా కూడా కాస్త సెటిల్ ఐనట్టు తెలుస్తోంది.బుల్లితెరలో ప్రేమపెళ్లిళ్లు కొత్తేమీ. అదే ట్రెండ్‌లో ప్రవీణ్-వంశిత జంట కూడా తమ వాళ్ళ లవ్ గురించి అందరికీ చెప్పారు .
ప్రస్తుతం వీరి పాత ఫోటోలు, సెల్ఫీలు కూడా మళ్లీ వైరల్ అవుతున్నాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ జంటకు ఆశీస్సులు అందిస్తున్నారు. దేవుడు ఆలస్యం చేసిన మంచే చేస్తాడు, సూపర్ జోడి, అన్నా నీకు అమ్మా నాన్న లేకపోయిన అమ్మలా చూసుకునే భార్య వచ్చింది అన్నయా, మీ జంట సూపర్ వున్నారు నీ కోసం దేవుడు ఈ అమ్మాయిని ఉంచాడు . ఏది మంచి ఏది చెడు అని దేవుడికి తెలుసు అందుకే కొన్ని మన జీవితంలో తొలగించి, కొన్ని ఇస్తాడు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |