![]() |
![]() |

జీ తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న 'జయం' సీరియల్ రోజురోజుకూ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మంగళవారం నాటి ఎపిసోడ్-219 లో ఇందుమతి తన పంతాన్ని నెగ్గించుకోవడమే కాకుండా, ఇషికను ఇంటికే పరిమితం చేసేలా మాస్టర్ ప్లాన్ వేసింది. తన భర్త, కొడుకులను ఆఫీస్ బాధ్యతల్లోకి దింపి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇందుమతి హాల్లో టెన్షన్ పడుతుండటం చూసిన రంగా, గంగలు ఆమె వేసే తదుపరి అడుగు కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. సరిగ్గా అదే సమయంలో ఇషిక ఆఫీస్కు వెళ్లేందుకు సిద్ధమవ్వగా ఇందుమతి అడ్డుకుంటుంది. "నీ అవసరం ఆఫీస్లో లేదు, నా భర్త రాఘవ, నీ భర్త సూర్య ఆ బాధ్యతలు చూసుకుంటారు" అని తెగేసి చెప్పడంతో ఇషిక షాకవుతుంది.
ఇక ఈ సీరియల్లో హైలైట్ సీన్ ఏమిటంటే.. రాఘవ, సూర్య ఇద్దరూ స్టైలిష్గా సూట్లు ధరించి పైనుంచి కిందకు రావడం. ఎప్పుడూ సాధారణంగా ఉండే వీళ్ళిద్దరు చైర్మన్ లుక్లో కనిపించడంతో ఇంట్లోని వాళ్ళంతా చూసి నోరెళ్లబెట్టారు. ఇక ఇందుమతి చేసిన ఈ పనికి వీరు అభ్యంతరం చెప్పాలని చూసినా రుద్ర గట్టిగా వారించడంతో సైలెంట్ అయిపోతాడు. మరోవైపు ఇషిక కోపంతో రగిలిపోతుండగా, ఆమెను కూల్ చేయడానికి ఒక కొత్త పని చెప్తాడు వీరు. ఈ ఇంటికి ఒక ఆడపడుచు ఉందని, ఆమె ఎందుకు దూరమైందో కనుక్కోవాలని చెప్తాడు. ఇందుమతి మనసు గెలుచుకుని ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని ఇషికకు సలహా ఇస్తాడు వీరు. అటు రుద్ర కూడా పెద్దాయన ద్వారా ఈ నిజాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించినా ఫలితం దక్కదు.
ఆ ఇంటి ఆడపడుచు ఎవరు? ఆమెను ఎందుకు దూరం పెట్టారు? అనే మిస్టరీ త్వరలో వీడనుందని నెటిజన్లు భావిస్తున్నారు. రంగా ఇచ్చే ఐడియాలతో ఇందుమతి ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. వచ్చే ఎపిసోడ్లో ఇషిక తన అత్తగారి నుంచి రహస్యాన్ని రాబట్టగలుగుతుందా? లేదా ఇందుమతి చేతిలో మరోసారి భంగపడుతుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
![]() |
![]() |