![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-615 లో.. దీప, కార్తీక్ సరదాగా మాట్లాడుకుంటారు. కార్తీక్ కి శివన్నారాయణ ఫోన్ చేసి నిన్ను ఒకసారి కలవాలని అంటాడు. ఎప్పుడు అని కార్తీక్ అనగానే ఉదయాన్నే అని శివన్నారాయణ అంటాడు. సరేనని కార్తీక్ అంటాడు. నువ్వు చెప్పినట్టే చేశాను ఇప్పుడు ఏం చేయబోతున్నావని జ్యోత్స్నతో శివన్నారాయణ అంటాడు. మీకు దీప ఎలాంటిదో తెలియజేయబోతున్నానని జ్యోత్స్న అంటుంది. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకి ప్రమాదం అందుకే హాస్పిటల్ లో జాయిన్ చేశానని కార్తీక్ చెప్పాడు. ఇందులో నీ సవాలేంటని శివన్నారాయణ అడుగుతాడు.
నాకొక అవకాశం ఇవ్వు తాత.. దీప, కార్తీక్ ఆడుతున్నా నాటకాన్ని బయట పెడతానని జ్యోత్స్న అంటుంది. సరే ఇది నిరూపించలేకపోతే పనిష్మెంట్ మీకు.. నిరూపిస్తే పనిష్మెంట్ వాళ్ళకి అని శివన్నారాయణ అంటాడు. మరోవైపు శ్రీధర్, కాంచన మాట్లాడుకుంటారు. కార్తీక్ ఏదో దాస్తున్నాడని అన్నారు. మరి హాస్పిటల్ కి వెళ్ళారా.. నిజం తెలుసుకున్నారా అని కాంచన అనగానే లేదని శ్రీధర్ అంటాడు. దీప, కార్తీక్ కలసి ఏదో దాస్తున్నారు. అది నిరూపిస్తానని జ్యోత్స్న ఎంట్రీ ఇస్తుంది. అసలు నిన్ను ఎవరు లోనికి రానిచ్చారు.. బయటకు పోవే అని కాంచన అంటుంది. నీకు కోడలిగా కావాలంటే పనిమనిషి కావాలి.. అయిదో క్లాస్ ఫెయిల్ అవ్వాలి.. అంటు వెటకారంగా జ్యోత్స్న మాట్లాడుతుంది. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకి ఏం ప్రమాదం లేదని నేను నిరూపిస్తానని జ్యోత్స్న అనగానే సరేనని శ్రీధర్, కాంచన అంటారు. ఇక ప్లాన్ ప్రకారం దీపకి కాల్ చేపిస్తుంది జ్యోత్స్న.
స్కూల్ లో శౌర్య మెట్లు దిగబోతూ పడిపోయిందని దీపకి ఫోన్ చేసి చెప్పగానే వెంటనే కంగారుగా దీప వస్తుంది. అప్పుడే శ్రీధర్ వస్తాడు. అదంతా దీప చెప్పగానే ముందు మనం హాస్పిటల్ కి వెళ్దామని దీపని వేరొక హాస్పిటల్ కి తోసుకొస్తాడు శ్రీధర్. అదే విధంగా కార్తీక్ ని శివన్నారాయణ తీసుకొస్తాడు. ఎందుకు తీసుకొచ్చారని కార్తీక్, దీప అడుగగా.. సెకెండ్ ఒపీనియన్ కోసం దీపకి మళ్ళీ టెస్ట్ లు చేయించాలని కాంచన, శివన్నారాయణ అంటారు. దాంతో కార్తీక్ , దీప షాక్ అవుతారు. మళ్ళీ టెస్ట్ లు ఎందుకు.. నేను చేపించాను కదా అని కార్తీక్ అంటాడు. సెకెండ్ ఒపీనియన్ తీసుకుంటే తప్పేంటి బావ అని జ్యోత్స్న అనగానే కార్తీక్ కి కోపం వస్తుంది. కాంచన, శివన్నారాయణ కలిసి బలవంతం చేస్తారు. దాంతో దీపని డాక్టర్ టెస్ట్ ల కోసం రమ్మనగానే తను వెళ్తుంది. పరిస్థితి చేయి దాటిపోయింది దీప నిజం తెలిసే టైం వచ్చింది దీప అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |