Home  »  TV News  »  Illu illalu pillalu: ప్రేమకి సర్ ప్రైజ్ ఇచ్చిన ధీరజ్.. శ్రీవల్లికి నిజం తెలిసిపోయిందిగా!

Updated : Mar 12, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-416 లో.. ప్రేమ పుట్టినరోజుని ఒక మెమోరెబుల్ డే గా సెలెబ్రేట్ చేస్తాడు. అది చూసి ప్రేమ ఫిధా అయిపోతుంది‌. ఇక నర్మద, సాగర్, శ్రీవల్లి, చందు అందరు కలిసి ప్రేమకి బర్త్ డే విషెస్ చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ధీరజ్ కి థాంక్స్ చెప్తుంది. నా లైఫ్ లోకి వచ్చినందుకు థాంక్స్ ప్రేమ.. ఐ లవ్ యూ ప్రేమ అని తనకి వాళ్ళ అమ్మ ఇచ్చిన ఉంగరాన్ని ప్రేమకి ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అది చూసిన ప్రేమ.. ఇది నిజమా కలా అని తెలుసుకోలేకపోతుంది.

ఆ తర్వాత రింగ్ తీసుకుంటుంది ప్రేమ. నిజమేనారా ఒకసారి గిల్లు నన్ను అని ప్రేమ అనగానే ధీరజ్ గిల్లుతాడు. ఆ తర్వాత తను మురిసిపోతుంది. ఇక ఇద్దరు ఒక రొమాంటిక్ సాంగ్ వేసుకుంటారు. మరుసటి రోజు నర్మద తన గదిలో ముస్తాబవుతుంటుంది. అప్పుడే డోర్ కొట్టిన శబ్దం వినపడటంతో నర్మద డోర్ తీస్తుంది. తీరా చూస్తే ప్రేమ. తను నర్మదని చేయి పట్టుకొని బయటకు లాక్కొని వెళ్తుంది. ఇక అప్పుడే శ్రీవల్లి బయట కేక్ తింటూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసి ఏదో జరుగుతుందని తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది శ్రీవల్లి. అక్కడ నర్మద, ప్రేమ మాట్లాడుకుంటుంటే శ్రీవల్లి వింటూ ఉంటుంది. అక్క నాకు ధీరజ్ ఐ లవ్ యూ చెప్పాడు అంటూ నర్మదని గట్టిగా హగ్ చేసుకుంటుంది ప్రేమ‌. కంగ్రాట్స్ అని నర్మద చెప్తుంది. అప్పుడే శ్రీవల్లి వచ్చి.. అదేంటి చెల్లి.. ధీరజ్ నువ్వు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు కదా.. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పడమేంటి.. కొత్తగా ప్రేమించుకుంటున్నట్టు ఈ ప్రపోజ్ ఏంటని శ్రీవల్లి అడుగుతుంది.

ఇక నర్మద మధ్యలో కలుగజేసుకొని.. నీకెందుకు ఇవన్నీ.. మీరు చేసిన కుట్రలు, మోసాలు అన్నీ తెలిసి కూడా మిమ్మల్ని ఇంకా ఈ ఇంట్లోనే ఉండనిచ్చాం కదా.. ఎందుకు నీకు ఇవన్నీ అని నర్మద కోప్పడగానే శ్రీవల్లి మెల్లిగా జారుకుంటుంది. ఇక అప్పుడే అమూల్యని తాళి మెడలో వేసుకోమని చెప్పింది నేనే అని తెలిస్తే అంతే అక్క అని నర్మదతో ప్రేమ అనడం శ్రీవల్లి వింటుంది. అమ్మ బాబోయ్.‌. ప్రేమనా దీని వెనక ఉందని శ్రీవల్లి అనుకుంటుంది. ఇక వేదవతి పూజ చేసి ప్రేమకి హారతి ఇస్తుంది. అంటే అన్నారంటారు గానీ నన్ను పిలవకుండా రాత్రి మీరు కేక్ కట్ చేసుకుంటారా అని వేదవతి అనగానే  నాకు తెలియదు అత్తా.‌. సడన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు లేకపోతే నీకు చెప్పకుండా ఉంటానా.. మా ముద్దుల అత్త అని ప్రేమ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.