Home  »  TV News  »  Karthika Deepam2: దశరథ్ కి నిజం తెలిసిందని చెప్పిన దాస్..జ్యోత్స్న షాక్!

Updated : Mar 10, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-613 లో.. శౌర్యకి కాంచన అన్నం తినిపిస్తుంటుంది‌. అమ్మనాన్న ఎక్కడికి వెళ్ళారు.. నువ్వు ఫస్ట్ తిను అని కాంచన అంటుంది. చిన్ననాన్నమ్మ ఎక్కడికి వెళ్ళింది అని శౌర్య అడుగుతుంది. నువ్వు అన్నం తింటావా ప్రశ్నలు తింటావా అని కాంచన అంటుంది. ఎక్కడికి వెళ్ళారని శౌర్య మళ్ళీ అడుగుతుంది. వెళ్ళినవాళ్ళు మళ్ళీ వస్తారు కదా అని కాంచన కోపంగా అంటుంది. నేను తినను అని శౌర్య అనగానే ఎందుకని కాంచన అంటుంది. నా మీద నీకు ప్రేమ తగ్గిందని శౌర్య అనగానే కాంచన ఎమోషనల్ అవుతుంది. నీకొక చెల్లి వచ్చినా నీ తర్వాతేనే నాకు ఎవరైనా అని కాంచన అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తాడు. అమ్మ ఏది అని శౌర్య అనగానే కార్తీక్ ఆలోచనలో పడతాడు. తాతయ్య ఇంట్లో ఉంది అమ్మ, సుమిత్రకి తోడుగా ఉందని కార్తీక్ అనగానే జ్యోత్స్న ఉంది కదా అని శౌర్య అంటుంది. అవన్నీ నీకు వద్దు.. నేను చెప్పే వరకు నీకు ఏం కావాలన్నా నానమ్మనే అడగాలి.. నానమ్మనే చూసుకుంటుందని కార్తీక్ అంటాడు.  సరేనని శౌర్య అంటుంది‌.

మరోవైపు దశరథ్, సుమిత్ర మాట్లాడుకుంటారు. దీపని హాస్పిటల్ లో జాయిన్ చేశారు కదా తన గురించి ఆలోచిస్తున్నారా అని సుమిత్ర అడుగుతుంది. తన గురించి ఆలోచించడానికి ఏం ఉంది‌‌ కార్తీక్ ఉన్నాడుగా అని దశరథ్ అంటాడు. దీపకి ఈ టైమ్ లో అమ్మ తోడు ఉండాలని సుమిత్ర అంటుంది. దీప ఒకవేళ మన కన్నకూతురు అయితే నిన్ను ఎంతో బాగా చూసుకునేది అని దశరథ్ అనగానే దీప నా కూతురేంటండి.. దీపని జ్యోత్స్నతో పోల్చకండి అని సుమిత్ర అంటుంది. మన అల్లుడు, కూతురు మనకోసం ఎంత పెద్ద త్యాగానికి సిద్ధపడ్డారో తెలిస్తే తట్టుకోలేవని దశరథ్ మనసులో అనుకుంటాడు. మరోవైపు కాంచన, కార్తీక్ మాట్లాడుకుంటారు. ఈ అవిటిదానికి మొండితనం ఏనాడో అలవాటైంది. నీకు ఎవరు పుట్టినా శౌర్య నా పెద్ద మనవరాలే.. నా ప్రేమ తనకే చెందుతుంది. చెప్పురా కార్తీక్ నా మనవరాలికి ఏం కాదని చెప్పు.. నేను చచ్చిపోయేలోపు నీ రక్తం పంచుకుపుట్టే బిడ్డని చూడలాని అనుకుంటున్నా.. నా కోరిక నెరవేరుతుందా చెప్పురా కార్తీక్ అని కాంచన ఎమోషనల్ అవుతుంది. దాంతో కార్తీక్ తన కాళ్ళ మీద ఏడుస్తాడు. నన్ను క్షమించు అమ్మ అత్త కోసం నీకు అన్యాయం చేస్తున్నాని కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఒరేయ్ కార్తీక్ ఆ బిడ్డ మీద నేను ఆశలు పెట్టుకోవాలా వద్దా అని కాంచన అంటుంటే ఎవరి మీద మనం ఆశలు పెట్టుకోవద్దు అంటూ శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు.

అరేయ్ కార్తీక్ హాస్పిటల్ కి వెళ్తానని అన్నావ్ కదరా అని శ్రీధర్ అనగానే వెళ్తాను మాస్టారు అని కార్తీక్ వెళ్ళిపోతాడు. మీరు ఎందుకొచ్చారని కాంచన అడుగుతుంది. కొన్ని చెప్పడం కంటే చేసుకుంటూ పోవాలని, నా భాద్యత నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చిందని శ్రీధర్ అంటాడు. జ్యోత్స్న, దాస్ మాట్లాడుకుంటారు. మనమిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం.‌. నాకు వేరే దారి లేదు నాన్న అని జ్యోత్స్న అనగానే నన్ను ఇలా కలవొద్దని చెప్పాను కదా అని దాస్ అంటాడు. మమ్మీని జాయిన్ చేసిన అదే హాస్పిటల్ లో దీపని ఎందుకు జాయిన్ చేశారు.  నిజానికి నేను హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాలి.. నన్నేమో ఫోన్ చేసిన తర్వాత రమ్మని డాక్టర్ చెప్పింది.. దీప నుండి బబోన్ మ్యారో ట్రీట్ మెంట్ కి సంబందించిన స్టెప్ సిల్స్ తీసి స్డోర్ చేసే అవకాశం ఉంది కదా నాన్న అని జ్యోత్స్న అనగానే ఉండొచ్చమ్మా కానీ అవేమీ నాకు తెలియదని దాస్ అంటాడు. నాకు అనుమానం ఉందని జ్యోత్స్న అనగానే పదా శివన్నారాయణ దగ్గరికి వెళ్ళి అడుగుదామని దాస్ అంటాడు. ఏమని అని జ్యోత్స్న అనగానే DNA టెస్ట్ చేపిస్తే ఎవరి కూతురో తెలుస్తుంది కదా అని దాస్ అనగానే అప్పుడు అందరికి నిజం తెలుస్తుంది కదా అని జ్యోత్స్న అంటుంది. తెలియాల్సిన నిజాలన్నీ తెలిసిపోయాయని దాస్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. అంటే నాన్నకి అన్ని నిజాలు చెప్పేసావా అని జ్యోత్స్న అనగానే నీ గురించి ఇదే నేను చెప్పేది అన్నీ తెలుసుకుంటావని దాస్ అంటాడు. నా వెనుక మీరు ఎన్నిచేసినా.. నేను కోరుకున్నది నాకు దక్కి తీరాలని జ్యోత్స్న కోపంగా అంటుంది. నీకు రాసి పెట్టి ఉన్నది మాత్రమే నీకు దక్కుతుందని దాస్ చెప్పేసి వెళ్లిపోతాడు‌. మరోవైపు శ్రీధర్ కాంచన ఎప్పటిలాగే గొడవపడుతుంటారు‌. కార్తీక్ లేడు కాబట్టి ఈ ఇంటికి కాపలాగా ఉంటాను అది నా భాద్యత అని శ్రీధర్ అంటాడు. నేను ఒప్పుకోనని కాంచన అంటుంది. నేను ఇంట్లో ఉండను బయట కార్ లో ఉంటాను. ఇబ్బందిగా అనిపిస్తే కాల్ చెయ్, లేదా మెసెజ్ చెయ్ బై అని శ్రీధర్ బయటకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు అగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.