![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -202 లో.. గాయలతో ఉన్న దీప్తిని రుద్ర, గంగ కలిసి హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. దీప్తి కోసం బయట వెయిట్ చేస్తారు వాళ్లు బయటున్న విషయం లోపలున్న దీప్తికి తెలియదు. రౌడీలు తనకి కన్పిస్తారు. దాంతో తనని కిడ్నాప్ చేస్తారని దీప్తి వెళ్లిపోతుంది. గంగ, రుద్ర తను ఉన్న బెడ్ దగ్గరికి వెళ్తారు. దీప్తి లేకపోయేసరికి షాక్ అవుతారు. భయపడి వెళ్లినట్లు ఉందని రుద్ర అంటాడు.
ఆ తర్వాత గంగ, రుద్ర ఇంటికి వస్తారు. ఏంటి బావ పెళ్లికి వెళ్ళాము అన్నారు హాస్పిటల్ నుండి వస్తున్నారని వీరు అడుగుతాడు రుద్ర సైలెంట్ గా ఉంటాడు. వీరు అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదేంటీ అంటే అబద్దం చెప్పారా.. నీ భార్య లాగా నువ్వు కూడా అబద్దం చెప్తున్నావా అని శకుంతల అంటుంది. అప్పుడే దీప్తి పేరెంట్స్ ని తీసుకొని వస్తుంది పారు. వాళ్ళు అకాడమీ నుండి వస్తున్నారని పారు అంటుంది. మా అమ్మాయి ఎక్కడ రుద్ర సర్ మిమ్మల్ని నమ్మి పంపించానని వాళ్ళు అనగానే దీప్తికి అకాడమీలో టార్చర్ చేశారు.. అన్నీ భరించింది ఎక్కడ అందరికి చెప్తుందోనని తనని కిడ్నాప్ చెయ్యాలని అనుకున్నారు. దాంతో బయపడి పారిపోతుంటే దెబ్బలు తగిలాయి.. హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళాము.. తనని సేవ్ చేసింది మేము అని తెలియక అక్కడ నుండి వెళ్ళిపోయిందని రుద్ర చెప్తాడు. దాని అంతటికి కారణం రుద్ర అని పారు అంటుంది. కాదు మీ అన్నయ్య హరి అని పారుతో గంగ అంటుంది. దీప్తిని హరి బెదిరించిన వీడియోని అందరికి గంగ చూపిస్తుంది. మా అన్నయ్య అంత పని చేశాడా అని ఏం తెలియనట్లు పారు యాక్టింగ్ చేస్తుంది. హరి గురించి రుద్ర ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి చెప్తాడు.
ఆ తర్వాత రుద్ర దగ్గరికి గంగ వస్తుంది. నాకు నువ్వు రికార్డు చేసిన విషయం చెప్పలేదని గంగతో రుద్ర అంటాడు. మీరు తిడుతారని చెప్పలేదని గంగ అంటుంది. నువ్వే పోటీలో పాల్గొంటే ఇవేం ఉండకపోవని రుద్ర అంటాడు. పెద్దమ్మ మనసు మారే వరకు సైలెంట్ గా ఉంటానని రుద్ర అంటాడు. భర్తకి నచ్చినట్టు ఉండాలని రుద్ర అంటాడు. అదంతా శకుంతల వింటుంది. ఏం చేసినా వీళ్ళ మనసులో నుండి బాక్సింగ్ గురించి పోవడం లేదని అనుకుంటుంది. మరుసటి రోజు శకుంతల పూజ చేసి అందరికి హారతి ఇస్తుంది. గంగ, రుద్రలని సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తుంది. దాంతో అందరు ఆశ్చర్యంగా చూస్తారు. నేనొక నిర్ణయం తీసుకున్నాను.. గంగ, రుద్రలని హనీమూన్ పంపిస్తున్నాను.. వీరు అన్ని ఏర్పాట్లు చెయ్యమని చెప్తుంది. దాంతో రుద్ర, గంగ షాక్ అవుతారు. పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |